విజయమ్మ నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టం | Vijayamma's leadership to strengthen the party, | Sakshi
Sakshi News home page

విజయమ్మ నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టం

Published Wed, Apr 20 2016 1:20 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

Vijayamma's leadership to strengthen the party,

వైఎస్సార్ సీపీ నాయకుడు దాడి అప్పారావు

 

వన్‌టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టమవుతోందని నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ అధ్యక్షుడు దాడి అప్పారావు అన్నారు. వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు పంజా సెంటర్‌లోని ఆయన కార్యాలయంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళతో కేక్ కట్ చేయించి వేడుకలను ప్రారంభించారు.


అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను, మిఠాయిలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా దాడి అప్పారావు మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్సార్ సీపీ రానున్న రోజుల్లో ప్రజల అండదండలతో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. నాయకులు దాడి జగన్, మండేపూడి ఛటర్జీ, పాండు, రజనీ, పైడిపాటి మురళీ,  వరప్రకాష్, గౌరు, జిలానీ, నాగలక్ష్మి పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement