‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం’ | vijayasai reddy warning to tdp leaders | Sakshi
Sakshi News home page

‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం’

Published Mon, Jun 5 2017 1:55 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం’ - Sakshi

‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం’

విశాఖపట్నం: ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన ఈ భూముల విలువ రూ. 3 నుంచి రూ. 4 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలపై ‘సాక్షి’ టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 

భూకబ్జా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని, ఈ గ్యాంగ్‌కు మంత్రి నారా లోకేశ్‌ లీడర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని, ఈ భూకబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి.. దోచుకున్న సొమ్మునంతా రీకవరీ చేసి పేదలకు పంచుతామని ఆయన అన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement