భోగాపురం(విజయనగరం): ‘ఎయిర్‌పోర్ట్ కోసం భూములు తీసుకోబోమని హామీ ఇస్తేనే మా గ్రామాల్లోకి రండి.. లేకపోతే వెళ్లిపోండి’అని అధికారులను విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం, కవులవాడ గ్రామాల ప్రజలు నిలదీశారు. శనివారం నీరు-చెట్టు కార్యక్రమ నిర్వహణకు ఈ గ్రామాలకు వెళ్లిన ఎంపీడీవో, ఇతర అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమాన్ని రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. గ్రామస్తుల డిమాండ్‌ను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
విమానాశ్రయం నిర్మాణానికి ఒక్క భోగాపురం మండలం నుంచి 15 వేల ఎకరాలు తీసుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నందున అక్కడ ఐదు వేల ఎకరాలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని విజయనగరంలో విలేకరులకు తెలిపారు.