
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైఎస్ జగన్ కోరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.
వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు.
On this happy occasion of #VinayakaChavithi, May Lord Ganesha bless your home with much love, joy and prosperity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2018