జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె!
Published Sun, May 25 2014 12:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
విశాఖ: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగునున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తేది నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.
విశాఖ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో అనేక సమస్యలున్నాయని ఆర్టీసీ కార్మికులు అధికారులు దృష్టికి గతకొద్దికాలంగా తీసుకువెళ్తున్నారు. అయితే సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారని.. అందుకే తాము సమ్మె బాట పట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు వివరణ ఇచ్చారు.
Advertisement
Advertisement