Visakhapatnam Region
-
మీ చీకటిలో వెలుగులమై..
హుద్‌హుద్ బాధితుల కోసం చేయీచేయీ కలిపి... తరలివచ్చిన తారా లోకం రోజంతా వినోదాల విందు హుషారెత్తించిన నృత్యాలు ఉల్లాసభరితంగా క్రీడలు సందడిగా మేముసైతం హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది. బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు. టికెట్ల ద్వారా వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. తారల ఆటపాటలతో.. అభిమానుల సందడితో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ నాయకుల హెచ్చరిక శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: విశాఖపట్నం రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యవైఖరికి నిరసనగా శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఈయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈయూ రీజనల్ అధ్యక్షుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం అర్బన్ ట్రాఫిక్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ ఎ.వీరయ్యచౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూనియన్‌పై పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. విజయనగరం జోన్‌లోని నాలుగు రీజియన్లకు సంబంధించి 27 డిపోల్లో ఆర్టీసీ అధికారులు గుర్తింపు సంఘంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చార్టులు వేయాలని, టిమ్ డ్యూటీలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలుచేయూలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సులకు డబుల్ డోర్లు తీసివేయాలనే నిబంధన అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అద్దెబస్సుల డ్రైవర్లకు ఇన్సెంటివ్‌లు ఇస్తూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, ఏడీ, పీడీల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 3వ తేదీన ఛలో ఈడీ కార్యాలయం చేపడతామని హెచ్చరించారు. ధర్నా లో ఈయూ డివిజనల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు, పి.నానాజీ, కె.శంకరరావు, శ్రీకాకుళం ఒకటో డిపో అధ్య క్ష, కార్యదర్శిలు జి.త్రినాథ్, ఎస్.వి.రమణ, జి.బి. మూర్తి, పి.వి.రావు, కె.వి.రమణ, బి.జయదేవ్, ఎం.టి.వి.రావు, కె.బి.రావు, పి.రమేష్, కె.బాబూరావు, సీహెచ్.కృష్ణారావు, కె.గోవిందరావు, ఎ.త్రినాథ్, ఎస్.ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె!
విశాఖ: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగునున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తేది నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. విశాఖ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో అనేక సమస్యలున్నాయని ఆర్టీసీ కార్మికులు అధికారులు దృష్టికి గతకొద్దికాలంగా తీసుకువెళ్తున్నారు. అయితే సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారని.. అందుకే తాము సమ్మె బాట పట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు వివరణ ఇచ్చారు. -
ఆర్టీసీ రైట్..రైట్..
= రోడ్డెక్కిన బస్సులు = వివిధ కారణాలతో 90 నిలిపివేత = రెండు రోజుల్లో సాధారణ స్థితి = ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు సాక్షి, విశాఖపట్నం : సరిగ్గా రెండు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దూకుడుకు కొంత చెక్ పడినట్టే. దసరా పండుగకు వెళ్లేవారంతా కాంప్లెక్స్‌ల్లో పిల్లాపాపలతో క్యూ కట్టారు. సమైక్యాంధ్ర సమ్మె నేపథ్యంలో విశాఖ రీజియన్ పరిధిలో సుమారు 1060 బస్సులు రెండు నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్ట్ సిబ్బందితో బస్సులు నడుపుదామని భావించినా ఉద్యమకారులు అంగీకరించకపోవడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఫలితంగా ఆర్టీసీ సుమారు రూ.48 కోట్ల ఆదాయం కోల్పోయింది. సీఎం, రవాణాశాఖ మంత్రితో ఆర్టీసీ కార్మిక నాయకులు, అధికారులు శుక్రవారం జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తొలి సర్వీసు 4.30కే : అర్ధరాత్రే బస్సుల్ని సిద్ధం చేసిన అధికారులు శనివారం ఉదయం 4.30 గంటలకే వాహనాల్ని రోడ్డుమీదకు పంపించేశారు. ఇతర ప్రాంతాల నుంచి 5 గంటల సమయంలో బస్సులు రయ్ మంటూ వచ్చేశాయి. అయితే రెండు నెలల పాటు బస్సులు కదలకపోవడంతో మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, సెల్ఫ్ ఆగిపోవడం వంటి ఇబ్బందుల కారణంగా సుమారు 90 బస్సులు ముందుకు కదల్లేకపోయాయి. దీంతో స్టాండ్‌బై బసుల్ని (అత్యవసర సర్వీసులు) వాడుకున్నారు. అవి తప్పా మిగిలిన బస్సులన్నీ రోడ్లపై పరుగులు తీశాయి. ప్రయాణికుల్ని మోసుకుంటూ వెళ్లిపోయాయి. విశాఖ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ బస్సుల్ని పంపించారు. కొంతమంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ఇబ్బంది ఎదురైనా అధికారులు క్రమంగా పునరుద్ధరించారు. రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికే వచ్చేస్తాయని ఆర్టీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. స్పందన బావుంది బస్సులు యథావిధిగా నడపడంతో జనం నుంచి స్పందన బాగానే ఉంది. సాధారణ స్థితిలో ఉన్నట్టే బస్సుల్ని పంపించాం. ఇన్నాళ్లూ తాము చాలా ఇబ్బందులకు గురయ్యామని, ప్రైవేట్ ట్రావెల్స్ తమను దోచుకున్నారని ప్రయాణికులు మా వద్ద వాపోయారు. తొలిరోజు ఆపరేషన్ సక్సెస్. దసరా నేపథ్యంలో ప్రత్యేక సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాం. సమ్మె కాలంలో సహకరించిన జనానికి, కార్మిక సంఘాలకు, సిబ్బందికి కృతజ్ఞతలు. - వై. జగదీష్‌బాబు, రీజినల్ మేనేజర్