వివేకానందుడు స్ఫూర్తి ప్రదాత
తానా అధ్యక్షుడు సతీశ్ వేమన
కకందుకూరు : లల్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించు అన్న స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలను శుక్రవారం స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత చదువులతో పాటు సంపాదనకు సైతం అవకాశం ఉంటుందన్నారు. యువత దీన్ని ఉపయోగించుకుని తిరిగి మాతృభూమి సేవ చేయాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని తెలుగువారి సంక్షేమం కోసం తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో సైతం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో యువత ఉపాధి కోసం ఎయిర్‌టెల్ కాల్ సెంటర్ ప్రారంభించిన ప్రకాశం యాజమాన్యాన్ని అభినందించారు. స్టెప్ సీఈఓ రవి మాట్లాడుతూ యువతలో దాగి ఉనన నైపుణ్యాలను వెలికి తీయడానికి నిర్వహిస్తున్న యువజనోత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ట్రెజరర్ కంచర్ల శ్రీకాంత్, తానా సభ్యులు వడ్లమూడి విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.