శభాష్ పోలీస్ | vizag police won a three medals in republic day celebrations | Sakshi
Sakshi News home page

శభాష్ పోలీస్

Published Thu, Jan 29 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

శభాష్ పోలీస్

శభాష్ పోలీస్

భారతీయ పోలీసు పతకానికి ముగ్గురి ఎంపిక
రిపబ్లిక్ దినోత్సం రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటన

 
 విశాఖపట్నం:పోలీస్ డిపార్టుమెంట్‌లో అత్యుత్తమ సేవా పతకమైన భారతీయ పోలీసు పతకం నగరానికి చెందిన ముగ్గురిని వరించింది. వారిలో ఒకరు రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బంటు అచ్యుతరావు, మరొకరు జిల్లా పోలీస్ విభాగంలో ఎస్‌బీఎక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అన్నాబత్తుల వెంకటరావు, ఏసీబీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ హామీద్ ఖాన్. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. నవ్య ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా, అందులో జిల్లాకు ముగ్గురికి రావటం గర్వకారణంగా పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఉత్తమ సేవలకు గుర్తుగా ఈ పతకాన్ని ప్రభుత్వం అందించటం విశేషం.
 
పేరు    :  బంటు అచ్యుతరావు
స్వగ్రామం  :  విజయనగరం జిల్లా, బొబ్బిలిమండలం రాజుపేట
తొలి పోస్టింగ్  :  1985 ఎస్‌ఐ
పదోన్నతులు  :  1994లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్, 2007లో  ఏసీబీ డీఎస్‌పీ, 2011లో విశాఖ పోలీస్  కమిషనరేట్ పరిపాలనా విభాగంలో అదనపు సూపరింటెండెంట్
ప్రస్తుతం    :    విశాఖ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
పురస్కారాలు  :   2003లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ సేవా పతకం
 
 అందరి సహకారంతో సాకారం

ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యాను. నేను చేసిన సేవ లు ఉన్నతాధికారులు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. విధుల్లో క్రమశిక్షణతో మెలిగి, తోటి సిబ్బంది సహకారంతోనే సర్వీసులో మంచి పతకాలు సాధించగలిగాను.
 
పేరు    :    అన్నాబత్తుల వెంకట్రావు
స్వగ్రామం    :    విశాఖ జిల్లా
తొలి పోస్టింగ్    :    1984 ఫిబ్రవరి 1వ తేదీన విశాఖలో కానిస్టేబుల్‌గా చేరిక
పదోన్నతులు  :  హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్
ప్రస్తుతం  :   జిల్లా స్పెషల్ బ్రాంచిలో ఎస్‌బీఎక్స్ ఇన్‌స్పెక్టర్
పురస్కారాలు   :  2004లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సేవా పతకం, 400 వరకూ గుడ్ సర్వీస్ రివార్డులు, సర్వీస్ మెడల్స్, క్యాష్ అవార్డులు
 
ఆనందంగా ఉంది

కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగటంలో సిబ్బంది, ఉన్నతాధికారుల సహకారం మరువలేను. నా సేవలను గుర్తించటం వల్లనే పలు అవార్డులు అందుకోగలిగాను. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది.
 
పేరు    :    మహ్మద్ హామీద్‌ఖాన్
స్వగ్రామం    :    ఏలూరు
తొలి పోస్టింగ్    :    1983 బ్యాచ్ కానిస్టేబుల్‌గా చేరిక
పదోన్నతులు    :    హెడ్ కానిస్టేబుల్
ప్రస్తుతం    :    విశాఖ ఏసీబీ డిపార్ట్‌మెంట్‌లో  హెడ్‌కానిస్టేబుల్
పురస్కారాలు    :    89 క్యాష్ అవార్డులు, 14 గుడ్ సర్వీస్ అవార్డులు, 2003లో  ఏపీ పోలీసు సేవా పతకం, 2011లో ఏపీ పోలీసు ఉత్తమ సేవా పతకం
 
కృతజ్ఞతలు

నా 32ఏళ్ల సర్వీసులో విధులు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన సహోద్యోగులు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు.  నా భార్య మల్లికాభేగం, నా ఇద్దరు అమ్మాయిలు, కుమారుడి సహకారం ఉంది.సర్వీస్‌లో ఒక్క రిమార్కు లేకుండా పనిచేసుకుంటూ వచ్చాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement