Indian Police Medal
-
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పతకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పతకం(ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–పీపీఎం) లభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందజేయనున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌తోపాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు. వెంకటరెడ్డికి ఐపీఎం రిటైర్డ్ ఏఎస్పీ నల్లమిల్లి వెంకటరెడ్డి తన సర్వీస్ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు కేంద్ర హోం శాఖ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది. సబ్ ఇన్స్పెక్టర్ 1989 బ్యాచ్‌కు చెందిన వెంకటరెడ్డి పోలీస్ శాఖలో విశిష్టమైన సేవలందించారు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీగా అనేక హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆయన పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో గతేడాది ఆయన అందించిన సేవలకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
గ్రేట్ పోలీస్
►ఐదుగురికి కేంద్ర పోలీసు పతకాలు ►చిక్కడపల్లి ఏసీపీకి ఇండియన్ పోలీసు మెడల్ ►మరో ఇద్దరు అధికారులకు ‘స్వాతంత్య్ర పతకాలు’ ►మహిళా జైలు చీఫ్ వార్డర్, ఎస్ఐలకు ప్రెసిడెంట్ మెడల్స్ నగరానికి చెందిన ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులు, ఒక మహిళా జైలు వార్డర్, ఎస్ఐలు అత్యున్నత స్థాయి మెడల్స్ సాధించి శభాష్ అన్పించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం సోమవారం ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (పీపీఎం), ఇండియన్ పోలీసు మెడల్స్ (ఐపీఎం)కు మెట్రో రైల్లో అదనపు డీసీపీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య, సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీ పి.గిరిరాజు, చంచల్‌గూడ మహిళా జైలు చీఫ్ వార్డర్ ప్రమీలాబాయి, ఎస్ఐ నారాయణరెడ్డి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు వీరికి మెడల్స్ దక్కాయి. సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం సోమవారం ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (పీపీఎం), ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం) పతకాల్లో నగర పోలీసు విభాగానికి ఐదు దక్కాయి. మెట్రో రైల్లో అదనపు డీసీపీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య, సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీ పి.గిరిరాజు, చంచల్‌గూడ మహిళా జైలు చీఫ్ వార్డర్ ప్రమీ లాబాయికి పతకాలు లభించాయి. తమకు ఈ పతకాలు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తమ బాధ్యతల్ని మరింత పెంచి, విధులకు పునరంకితమయ్యేలా చేసిందని ఆ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. ఆ వివరాలు.... ఎ.బాలకృష్ణ: హైదరాబాద్ మెట్రో రైల్లో అదనపు ఎస్పీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణకు పీపీఎం దక్కింది. అనంతపురానికి చెందిన ఈయన 1985లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. నగరంలోని బేగంబజార్, మహంకాళి ఠాణాల్లో పని చేశారు. ఇన్స్పెక్టర్గా పదోన్నతి తర్వాత ఎనిమిదేళ్ళ పాటు అవినీతి నిరోధక శాఖలో ఆపై నిఘా విభాగం, నగర స్పెషల్ బ్రాంచ్, బేగంపేట ట్రాఫిక్ల్లో విధులు నిర్వర్తించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన తర్వాత ట్రాఫిక్ విభాగంలో సెంట్రల్ జోన్‌కు పనిచేశారు. ఆపై మెట్రో రైల్ సంస్థలోకి డిప్యుటేషన్‌పై వెళ్ళిన బాలకృష్ణ అక్కడ ఉండగానే అదనపు డీసీపీగా పదోన్నతి పొందారు. మెట్రో రైల్ నిర్మాణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ఈయన అధ్యయనం చేసి అమలయ్యేలా చూశారు. బాలకృష్ణకు 1996లో పోలీసు సేవా పతకం, 2000లో ఉత్తమ సేవా పతకం, 2009లో ఇండియన్ పోలీసు మెడల్, 2010లో జనరక్షక్ అవార్డ్, 2012లో మహోన్నతి పోలీసు సేవా పతకం లభించాయి. జె.నర్సయ్య: చిక్కడపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న జోగుల నర్సయ్యకు ఐపీఎం దక్కింది. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన నర్సయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన తర్వాత 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. బంజారాహిల్స్, అంబర్‌పేట, గాంధీనగర్, కాచిగూడల్లో ఎస్సైగా, మహబూబ్‌నగర్‌లోని ఆత్మకూరు, నగరంలోని పంజగుట్ట, టప్పాచబుత్ర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్, ఆసిఫ్నగర్ల్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన తర్వాత సంతోష్‌నగర్‌లో పని చేసి ప్రస్తుతం చిక్కడపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1993లో జరిగిన బాంబుల శివారెడ్డి హత్య, 2011 నాటి డీఆర్డీఓ సైంటిస్ట్ కుమారుడు ప్రణవ్ కిడ్నాప్, హత్య, సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉండగా నగర చరిత్రలోనే తొలిసారిగా 300 గ్రామలు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈయన సేవలకు 2010లో పోలీసు సేవా పతకం, 2015లో ఉత్తమ సేవా పతకం లభించాయి. వీటితో పాటు 32 మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీలు, 350 రివార్డులు, 20 అభినందన పత్రాలు సొంతమయ్యాయి. పి.గిరిరాజు: సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీ పి.గిరిరాజు ప్రసుత్తం డిప్యుటేషన్‌పై డీజీపీ కార్యాలయంలో డీఎస్పీ స్టోర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1991లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి వచ్చిన ఆయన 2010లో ఏసీపీగా పదోన్నతి పొందారు. ప్రధాన మంత్రుల భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీగా సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన పీవీ నర్సింహారావు నుంచి మన్మోహన్సింగ్ వరకు ప్రధానులుగా పని చేసినప్పుడు వారి వద్ద విధులు నిర్వర్తించారు. గిరిరాజు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండగా ఆయన వద్దా పని చేశారు. అటల్ ప్రధాని హోదాలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఆ సమయంలో గిరిరాజు పైలెట్ డ్యూటీలో ఉండి కాన్వాయ్‌లోని మొదటి వాహనంలో ఉన్నారు. ఈ కాన్వాయ్ ప్రయాణిస్తూ ఓ రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఎడమ వైపు నుంచి ఓ రైలు ఇంజన్ దూసుకురావడాన్ని గుర్తించిన గిరిరాజు అప్రమత్తమై కాన్వాయ్‌ను ఆపి పెను ప్రమాదం తప్పించారు. 2007లో జరిగిన స్టేట్ పోలీసు డ్యూటీ మీట్లో పిస్టల్ ఫైరింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రమీలాబాయి: చంచల్‌గూడ: చంచల్‌గూడ మహిళల జైల్లో చీఫ్ హెడ్ వార్డర్‌గా విధులు నిర్వహిస్తున్న అనుముల ప్రమీలాబాయికి రాష్ట్రపతి పురస్కారం దక్కింది. 1986లో ఆమె జైళ్ల శాఖలో వార్డర్‌గా ఎంపికై ఉద్యోగంలో చేరారు. ఆమె వరంగల్, హైదరాబాద్ జైళ్లలో పనిచేశారు. ప్రమీల భర్త సారయ్య కూడా జైళ్ల శాఖ ఉద్యోగి. వరంగల్ జైల్లో హెడ్ వార్డర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్యకు అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వారి సొంత ఊరు ఖాజీపేట. 1989లో ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రమీలాబాయికి పతకం రావడం పట్ల జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం, జైలర్ అమరావతి, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఎస్ఐ నారాయణరెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సురక్ష ప్లాజా అధికారిగా పనిచేస్తున్న ఎస్ఐ ఆర్.నారాయణరెడ్డికి రాష్ట్రపతిఅవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన ఆయన.. 18 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీస్ విభాగంలో తన సేవలను గుర్తించి అవార్డునకు ఎంపిక చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అవార్డునకు ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. -
పోలీస్ అవార్డుల కోసం 22 మంది
అధికారుల పేర్లను కేంద్రానికి పంపిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (ఐపీఎం), ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ (పీపీఎం) అవార్డులకు సంబంధించి 22 మంది అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించింది. రాష్ట్ర హోంశాఖ రూపొందించిన ఈ జాబితాను ప్రభుత్వం పరిశీలించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐపీఎం, పీపీఎంలకు ఎంపికైన అధికారులకు ఈ అవార్డులను అందజేస్తారు. ఐపీఎం కేటగిరీలో 17 మంది, పీపీఎం కేటగిరీలో ఐదుగురు పోలీసు అధికారుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తూ జాబితా పంపించింది. వీరిలో ఐపీఎం కేటగిరీలోని ముగ్గురు, పీపీఎం కేటగిరీలోని ఐదుగురికి సంబంధించిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)ను కేంద్రానికి అందించిం ది. మిగతా వారి ఏసీఆర్ కూడా త్వరలో పంపనుంది. రెండు విభాగాలలో కలిపి ఐదుగురు ఐపీఎస్ అధికారులున్నారు. ఐపీఎం కోసం కేంద్రానికి పంపిన జాబితా 1. సి.రవివర్మ, ఐపీఎస్, డీఐజీ సైబర్ క్రైం, సీఐడీ 2. వి.శివకుమార్, ఐపీఎస్, జాయింట్ డెరైక్టర్, ఏసీబీ 3. ఎరబాటి శ్రీనివాసరావు, కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్ఎస్పీ 4. సీహెచ్ నరోత్తంరెడ్డి, అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ 5. కె.ఎస్.నటరాజన్ బాలాజీ, అసిస్టెంట్ కమాండెంట్,15వ బెటాలియన్, టీఎస్ఎస్పీ 6. మురళీకృష్ణ, ఏఎస్పీ, ఎస్ఐబీ 7. ఎస్కే నజీముద్దీన్, ఏసీబీ, పాస్‌పోర్ట్ 8. ఎ.బాలకోటి, డీఎస్పీ, మహబూబ్‌నగర్ జిల్లా 9. కె.జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ, ఎస్ఐబీ 10. అంగార వెంకటసత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఎస్బీ, సైబరాబాద్ 11. కె.రమణారెడ్డి, ఏఎస్ఐ, సీసీఎస్, వరంగల్ రూరల్ 12. డీహెచ్ వీరనాగయ్య, ఏఎస్ఐ, ఇంటెలిజెన్స్ 13. వి.పాండురంగారావు, ఏఎస్ఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ 14. చిలుకూరు సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ, సైబరాబాద్ 15. మహ్మద్ అబ్దుల్ నయీం, హెడ్ కానిస్టేబుల్, ఫస్ట్ బెటాలియన్ 16. డి.బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ 17. రమేశ్‌బాబు, గ్రేహౌండ్స్ పీపీఎం కోసం అధికారుల జాబితా... 1.రాజీవ్త్రన్, ఐపీఎస్, ఫైర్ డీజీ 2. సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ 3. టీవీ శశిధర్‌రెడ్డి, జాయింట్ సీపీ, సైబరాబాద్ 4. కె.రామ్మోహన్, ఏఎస్పీ, సైబర్ క్రైం, సీఐడీ 5.ఎం.రామకృష్ణ, డీఎస్పీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ -
కేంద్ర పోలీసు అవార్డులకు రాష్ట్ర జాబితా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా ఇచ్చే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం), రాష్ట్రపతి పోలీస్ మెడల్ (పీపీఎం) అవార్డులకు సంబంధించి 24 మంది పోలీసు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించింది. ఎంపికైన అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తారు. ఐపీఎం కేటగిరిలో పోలీసు అధికారులను, పీపీఎం కేటగిరిలో 8 మంది పోలీసు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ జాబితా పంపించింది. ఇందుకు సంబంధించి ఐపీఎం కేటగిరిలోని ముగ్గురు అధికారులు, పీపీఎం కేటగిరిలో ఐదుగురికి సంబంధించిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్) ను పంపింది. మిగతా వారికి సంబంధించిన ఏసీఆర్ను కూడా త్వరలో పంపనుంది. రెండు విభాగాల్లో కలిపి 8 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇండియన్ పోలీస్ మెడల్స్ (ఐపీఎం) కోసం కేంద్రానికి పంపిన పేర్లు 1.ఎం.స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, డీఐజీ గ్రేహౌండ్స్, హైదరాబాద్ 2. సి.రవి వర్మ, ఐపీఎస్, డీఐజీ, సైబర్ క్రైం సీఐడీ 3. ఎంకె సింగ్, ఐపీఎస్, ఐజీ (లా అండ్ ఆర్డర్) 4. పి.రవీందర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్ 5. మేకల భీంరావు, డీఎస్పీ, పీటీసీ, కరీంనగర్ 6. కొట్టం శ్యాం సుందర్, డీఎస్పీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ 7. కటకం మురళీధర్, డీఎస్పీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్ 8. కె.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ 9. వి.శ్యాంబాబు, ఇన్స్పెక్టర్, సీసీఎస్, హైదరాబాద్ 10. పి.రవీందర్, ఎస్ఐ డీఎస్బీ, నిజామాబాద్ 11. యండమూరి వాలి బాబ, ఎస్ఐ, జీడీకె-2, కరీంనగర్ 12. ఎన్.మారుతి రావు, ఎస్ఐ, ఎస్ సెల్, ఇంటెలిజెన్స్ 13. మహ్మద్ జాఫర్, ఎస్ఐ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్ 14. డి.కిషన్ జీ, ఏఆర్ ఎస్ఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ 15. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్ ఎస్ఐ, మహబూబ్‌నగర్ 16. షేక్ అబ్దుల్లా, హెడ్‌కానిస్టేబుల్, ఆమన్‌గల్, మహబూబ్‌నగర్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ (పీపీఎం) కోసం పంపిన పేర్లు 1. ఎం.గోపికృష్ణ, ఐపీఎస్, అడిషనల్ డీజీపీ, పోలీస్ సంస్కరణలు 2. అంజని కుమార్, ఐపీఎస్, ఏసీపీ హైదరాబాద్ 3. ఎన్.సూర్యనారాయణ, ఐపీఎస్, డెరైక్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ 4. ఎం.శివప్రసాద్, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్ 5. టి.వి.శశిధర్‌రెడ్డి, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సైబరాబాద్ 6. యు. రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ, సైబర్ క్రైం, సీఐడీ 7. జె.దేవేందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ 8. జె.అమరేందర్‌రెడ్డి, జాయింట్ సీపీ, కోఆర్డినేషన్, హైదరాబాద్ -
ఏపీ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్
కోవూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఓ గిరిజన కానిస్టేబుల్ ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. కొడవలూరు మండలం తలమంచి గిరిజన కాలనీకి చెందిన వేటగిరి గోపాలయ్య (58) కోవూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గోపాలయ్య ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైనట్లు కోవూరు సీఐ అశోక్‌వర్ధన్ సోమవారం మీడియాకు తెలిపారు. జనవరి 26న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ అందుకోనున్నట్టు వెల్లడించారు. గోపాలయ్య 40 ఏళ్లుగా సర్వీసులో ఉండగా ఇప్పటి వరకు 10 వరకు సేవా మెడల్స్‌ను అందుకున్నాడు. -
కుప్పం హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్
చిత్తూరు (అర్బన్) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు అందించే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ఈ సారి జిల్లా నుంచి ఒక్కరినే వరిం చింది. కుప్పం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఏ.మురళీమోహన్‌కు ఐపీఎంను ప్రకటిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. 1990లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి వచ్చిన మురళీమోహన్ విధి నిర్వహణలో 222 రివార్డులు, ఆరు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2009లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవాపతకాన్ని అందుకున్నారు. 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఈయనకు పదోన్నతి లభించింది. -
అలక్ష్యం..!
సాక్షి ప్రతినిధి, కడప: నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనో రిటైర్డ్ పోలీసు అధికారి. విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారు. పోలీసు సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీసు మెడల్ సాధించారు. పదవీ విరమణ చేసి కడప నగరం మారుతీనగర్‌లో నివాసముంటున్నారు. ఆయన ఇంట్లో ఉన్న పోలీసు పతకాలతోపాటు రూ.4.5 లక్షల విలువగల బంగారు, వెండి వస్తువులు 2012 అక్టోబర్ 19న చోరీ అయ్యాయి. కడప ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 259/2012 కేసు నమోదైంది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా విచారణలో ఉంది. రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 2013 సెప్టెంబర్ 10న దొంగలు పడ్డారు. సుమారు కోటి విలువైన బంగారు, నగదు ఎత్తుకెళ్లారు. క్రైం నంబర్ 161/2013గా కేసు నమోదైంది. ఇప్పటికీ విచారణలో ఉంది. పెపైచ్చు దోపిడీకి గురైన మొత్తం అంతా పోలీసులు కేసులో పొందుపర్చలేదు. ఈ రెండు ఘటనలు జిల్లాలో పోలీసు అధికారుల విచారణ తీరుకు ఉదాహరణలు మాత్రమే. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం పోలీసు వ్యవస్థ పనితీరును పరిశీలిస్తే ఒక చోరీ జరిగితే దానిని ఛేదించే వరకు పోలీసులు విశ్రమించేవారు కాదు. ఛాలెంజ్‌గా తీసుకొని నిందితులను పట్టుకునే వారు. ప్రస్తుతం పోలీసు అధికారుల్లో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించడంలో జిల్లాలో చిన్నబాస్‌లు ముందుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఈజీమనీ కోసం పోలీసు ప్రతిష్టను కొంతమంది తాకట్టు పెడుతున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్లో పోస్టింగ్ కోసం యాచిస్తున్నారు. అందుకు లక్షలాది రూపాయలను సైతం మంచినీళ్ల ప్రాయంగా ముట్టజెప్పుతున్నారు. ఈ క్రమంలో విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని, చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వర్తించాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చెలిమి చేసి ఈజీ మనీ కోసం అర్రులుచాచిన పోలీసు అధికారులు తెరపైకి వచ్చారు. జైల్లో ఉన్న దొంగను కోర్టుకు తరలిస్తూ దొంగతనాలు చేయించిన ఘనత సైతం జిల్లా పోలీసులకు దక్కింది. కిడ్నాపర్ సునీల్ ముఠాతో సత్సంబంధాలు పెట్టుకున్న తొమ్మిది మంది అధికారులపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగాన్ని గాడిలో పెట్టే బాధ్యతను ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చేయూత..! జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రిబుల్‌స్టార్ బాస్‌లు, ఐడీ పార్టీ బృందాల ప్రమేయం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటిని కొందరు ఉన్నతాధికారులు కట్టడి చేయాలనే తపనతో ఉన్నప్పటికీ కిందిస్థాయి యంత్రాంగం సహకారం లభించకపోవడంతో ఫుల్స్టాప్ పెట్టలేకున్నారని తెలుస్తోంది. ఆకస్మిక దాడులు సైతం అసాంఘిక శక్తులకు క్షణాల్లో తెలిసిపోవడమే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అధిక వడ్డీలకు కొందరు పోలీసు అధికారులే డబ్బులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వారి నుంచి పూచీకత్తుగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయమే అసలు లక్ష్యం... జిల్లాలో కొందరు పోలీసు అధికారులకు ప్రకృతి సంపద సైతం అక్రమ ఆదాయవనరుగా మారింది. ఇటీవల ఇసుక, ఎర్రచందనం విషయంలో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రస్తుతం సెటిల్మెంట్లు చేసుకుంటా బిజీగా ఉన్నా రు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బుంటేనే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలనే విధంగా పోలీసు అధికారుల పనితీరు ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. సివిల్ కేసుల్లో సైతం ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టించడం, దాని ఆధారంగా దండుకోవడం రివాజుగా మారింది. సివిల్ కేసుల్లో తలదూర్చమంటూ బోర్డులు పెట్టుకున్న చోటే యథేచ్ఛగా పంచాయితీలు నడుస్తున్నాయి. అక్రమార్జనకోసం అర్రులు చాస్తున్న పోలీసు అధికారులను నియంత్రించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
శభాష్ పోలీస్
భారతీయ పోలీసు పతకానికి ముగ్గురి ఎంపిక రిపబ్లిక్ దినోత్సం రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటన విశాఖపట్నం:పోలీస్ డిపార్టుమెంట్లో అత్యుత్తమ సేవా పతకమైన భారతీయ పోలీసు పతకం నగరానికి చెందిన ముగ్గురిని వరించింది. వారిలో ఒకరు రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బంటు అచ్యుతరావు, మరొకరు జిల్లా పోలీస్ విభాగంలో ఎస్బీఎక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అన్నాబత్తుల వెంకటరావు, ఏసీబీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ హామీద్ ఖాన్. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. నవ్య ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా, అందులో జిల్లాకు ముగ్గురికి రావటం గర్వకారణంగా పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఉత్తమ సేవలకు గుర్తుగా ఈ పతకాన్ని ప్రభుత్వం అందించటం విశేషం. పేరు : బంటు అచ్యుతరావు స్వగ్రామం : విజయనగరం జిల్లా, బొబ్బిలిమండలం రాజుపేట తొలి పోస్టింగ్ : 1985 ఎస్ఐ పదోన్నతులు : 1994లో ఏసీబీ ఇన్స్పెక్టర్, 2007లో ఏసీబీ డీఎస్పీ, 2011లో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిపాలనా విభాగంలో అదనపు సూపరింటెండెంట్ ప్రస్తుతం : విశాఖ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పురస్కారాలు : 2003లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ సేవా పతకం అందరి సహకారంతో సాకారం ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యాను. నేను చేసిన సేవ లు ఉన్నతాధికారులు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. విధుల్లో క్రమశిక్షణతో మెలిగి, తోటి సిబ్బంది సహకారంతోనే సర్వీసులో మంచి పతకాలు సాధించగలిగాను. పేరు : అన్నాబత్తుల వెంకట్రావు స్వగ్రామం : విశాఖ జిల్లా తొలి పోస్టింగ్ : 1984 ఫిబ్రవరి 1వ తేదీన విశాఖలో కానిస్టేబుల్‌గా చేరిక పదోన్నతులు : హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ప్రస్తుతం : జిల్లా స్పెషల్ బ్రాంచిలో ఎస్బీఎక్స్ ఇన్స్పెక్టర్ పురస్కారాలు : 2004లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సేవా పతకం, 400 వరకూ గుడ్ సర్వీస్ రివార్డులు, సర్వీస్ మెడల్స్, క్యాష్ అవార్డులు ఆనందంగా ఉంది కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదగటంలో సిబ్బంది, ఉన్నతాధికారుల సహకారం మరువలేను. నా సేవలను గుర్తించటం వల్లనే పలు అవార్డులు అందుకోగలిగాను. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. పేరు : మహ్మద్ హామీద్‌ఖాన్ స్వగ్రామం : ఏలూరు తొలి పోస్టింగ్ : 1983 బ్యాచ్ కానిస్టేబుల్‌గా చేరిక పదోన్నతులు : హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం : విశాఖ ఏసీబీ డిపార్ట్మెంట్లో హెడ్‌కానిస్టేబుల్ పురస్కారాలు : 89 క్యాష్ అవార్డులు, 14 గుడ్ సర్వీస్ అవార్డులు, 2003లో ఏపీ పోలీసు సేవా పతకం, 2011లో ఏపీ పోలీసు ఉత్తమ సేవా పతకం కృతజ్ఞతలు నా 32ఏళ్ల సర్వీసులో విధులు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన సహోద్యోగులు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. నా భార్య మల్లికాభేగం, నా ఇద్దరు అమ్మాయిలు, కుమారుడి సహకారం ఉంది.సర్వీస్‌లో ఒక్క రిమార్కు లేకుండా పనిచేసుకుంటూ వచ్చాను. -
ఇండియన్ పోలీసు మెడల్‌కు నాగేంద్ర ఎంపిక
అయినవిల్లి : అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముద్రగడ నాగేంద్రరావు ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ప్రతిభా పురస్కారంగా ఈ అవార్డును నాగేంద్ర వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందుకుంటారు. వీరవల్లిపాలానికి చెందిన నాగేంద్రరావు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన వీరవల్లిపాలెం మాజీ సర్పంచ్ ముద్రగడ వీరేశ్వరరావు కుమారుడు. 1984లో ఏపీఎస్పీలో ఆర్ఎస్సైగా చేరిన నాగేంద్ర 1999 నుంచి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. నాగేంద్రకు పురస్కారం రావడంపై రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, అయినవిల్లి మం డల పరిషత్ అధ్యక్షుడు సలాది పుల్లయ్యనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ హర్షం వ్యక్తం చేశారు. మెడల్‌కు ఎంపికవడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌లోఉన్న నాగేంద్ర ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు. -
‘వంగా’కు ఇండియన్ పోలీస్ మెడల్
ఒంగోలు క్రైం : ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పని చేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందిన వంగా సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసిన పోలీస్ పతకాల జాబితాలో సుబ్బారెడ్డి పేరూ ఉంది. రెండేళ్ల పాటు ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇటీవల ఏఎస్పీగా పదోన్నతి పొందారు. అందులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్పీలకు పోస్టింగ్‌ల కోసం హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ రావడంపై ఆ విభాగంలోని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వల్లభపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. 1985 ఎస్సై బ్యాచ్‌కు చెందిన సుబ్బారెడ్డి అం చెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారు. చీరాలలో శిక్షణా ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొందారు. 2009లో డీఎస్పీగా పదోన్నతి పొంది మొదట సీఐడీలో పని చేశారు. అనంతరం కడప జిల్లా మైదుకూరు డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్సైగా జిల్లాలోని కంభం, మార్టూరు, అద్దంకి, మేదరమెట్లతో పాటు పలు పోలీస్స్టేషన్లలో పని చేసి జిల్లాతో అనుబంధం పెంచుకున్నారు. ఆ తర్వాత సీఐగా గుంటూరు జిల్లా మా చర్ల, నెల్లూరు జిల్లా కావలి, గుడూరు, సూళ్లూరుపేటలో పని చేశారు. జిల్లాలోని పలు సర్కిళ్లలో సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన పోలీస్ విభాగంలో చేరినప్పటి నుంచి సీఎం శౌర్యపతకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, ఉత్తర సేవా పతకాలు ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యున్నత సేవా పతకం ఇండియన్ పోలీస్ మెడల్‌ను అక్కున చేర్చుకున్నారు. -
అవార్డులు ఆయన సొంతం
మహానంది: విధి నిర్వహణ ఆయన ప్రాణం. పేదలకు న్యాయం చేయాలి...వారికి అండగా నిలవాలన్న తపనే ఆయనకు గుర్తింపు తెచ్చింది. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. పోలీస్ కావాలనే లక్ష్యంతో శ్రమించి అనుకున్నది సాధించాడు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని నమ్మిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. ఎక్కడ పనిచేసిన అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటి వరకు ఆయన 366 రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. అంతేకాకుండా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు 2013 గణతంత్ర వేడుకల్లో ఆయన పేరు ప్రకటించారు. ఈ అవార్డును శుక్రవారం కర్నూలులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఐ అందుకోనున్నారు. శ్రీనివాసులు విజయ గాధపై సాక్షి కథనం... మహానంది మండలం ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బయ్య అలియాస్ మోజెస్, మద్దమ్మ దంపతుల కుమారుడు బుక్కా శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలన్న సంకల్పంతో శ్రమించాడు. గ్రామంలోని జెడ్పీ స్కూల్లో 10 వరకు చదివాడు. కర్నూలులోని కోల్స్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్, సిల్వర్‌జూబ్లీలో డిగ్రీ, ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. జులై 15, 1991లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. ఎస్ఐగా అనంతపురం జిల్లా పెనుగొండ, ఎల్కే పల్లి, రామగిరి, కూడేరు, తాడిపత్రి, ధర్మవరం, తదితర ప్రాంతాల్లో పనిచేసి అన్ని వర్గాల ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల ట్రాఫిక్, నక్సల్స్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. అనంతరం 2005 ఫిబ్రవరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్గా, 2005 నుంచి 2008 వరకు కల్యాణదుర్గం సర్కిల్లో, 2009-10లో చిత్తూరు డీటీసీ, ఆ తర్వాత ధర్మవరం, హిందూపురం, ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు పనిచేశారు. 2014 జనవరిలో హిందూపురం టౌన్ నుంచి కడప అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోనుండటంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఏఎస్పీకి ప్రదీప్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా ఏఎస్పీ ఎ.ప్రదీప్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో భారతప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. 2014 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందినవారు. నిజామాబాద్‌లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2008-09లో పదోన్నతిపై డీఎస్పీగా మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్, ఒంగోలు జిల్లాలో విధులు నిర్వహించారు. 2009లోనే ఉత్తమ రాష్ట్ర సేవా పతకాన్ని అందుకున్నారు. 2012లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. జిల్లా అడిషనల్ ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన నాటినుంచి శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలతో మమేకమై పనిచేశారు. విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం, శాంతిభద్రత పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించినందుకు భారత ప్రభుత్వం ఆయనను ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికచేసింది. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడంతో తనకు మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలతో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. అవార్డు రావడంపై జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఏఎస్పీకి అభినందనలు తెలిపారు. -
ప్రతిభావంతులకు పోలీస్ పతకాలు
ఢిల్లీ: అత్యున్నత ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు ప్రకటించారు. ఆ వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. ఇండియన్ పోలీస్ మెడల్స్: అనీల్‌కుమార్(డీఐజీ ), మధుసూదన్‌రెడ్డి(డీఐజీ ), నాగిరెడ్డి(డీఐజీ ) దేవెందర్సింగ్చౌహాన్(డీఐజీ ) సంజయ్‌కుమార్‌జైన్(జాయింట్ సీపీ) సోమశేఖర్‌రెడ్డి(సీఐడీ డైరెక్టర్), ప్రదీప్‌రెడ్డి( అడిషనల్ ఎస్పీ) రవిప్రకాశ్(అడిషనల్ ఎస్పీ) బొల్ల శ్రీనివాసులు (అడిషనల్ ఎస్పీ) ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్: తుషార్ త్రిపాఠి(అడిషనల్ డీజీ పీ), బీఎల్ మీనా(డీజీ ) రెడ్డి రవీందర్‌రెడ్డి( అడిషనల్ ఎస్పీ) మరికొంత మంది పోలీసులకు కూడా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వనున్నారు.