మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా ఏఎస్పీ ఎ.ప్రదీప్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో భారతప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. 2014 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందినవారు. నిజామాబాద్‌లో ఎస్‌ఐగా మొదటి పోస్టింగ్ నిర్వహించారు.
అనంతరం రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2008-09లో పదోన్నతిపై డీఎస్పీగా మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్, ఒంగోలు జిల్లాలో విధులు నిర్వహించారు. 2009లోనే ఉత్తమ రాష్ట్ర సేవా పతకాన్ని అందుకున్నారు. 2012లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. జిల్లా అడిషనల్ ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన నాటినుంచి శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలతో మమేకమై పనిచేశారు.
విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం, శాంతిభద్రత పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించినందుకు భారత ప్రభుత్వం ఆయనను ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికచేసింది. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడంతో తనకు మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలతో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. అవార్డు రావడంపై జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఏఎస్పీకి అభినందనలు తెలిపారు.
ఏఎస్పీకి ప్రదీప్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
Published Thu, Aug 15 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement