శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 20 కొత్త బస్సులు | 20 new busses for srivari bramhoshavas | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 20 కొత్త బస్సులు

Published Wed, Sep 28 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ఆర్టీసీ ఆర్‌ఎం  వి.నాగశివుడు

ఆర్టీసీ ఆర్‌ఎం వి.నాగశివుడు

 
–ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు వెల్లడి
తిరుపతి కల్చరల్‌:
 తిరుమలలో ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్న  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ  అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఆర్‌ఎం వి.నాగశివుడు తెలిపారు.  బుధవారం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ అందించనున్న సేవలు గురించి వెల్లడించారు. అత్యంత వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.  ఉత్సవాలకు 20 కొత్త సప్తగిరి సర్వీసులు రానున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అంచనాల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.  మెకానిక్స్, డ్రై వర్లకు  పత్యేక శిక్షణ కల్పించి బస్సుల కండీషన్‌ను మెరుగు పరచడం జరిగిందన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజూ 425 బస్సులతో  రెండు వేల ట్రిప్పులు తిప్పేలా చర్యలు తీసుకున్నామన్నారు.  అత్యంత పవిత్రమైన గరుడ సేవ నాడు  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  530 సర్వీసులతో  3800 ట్రిప్పులు తిప్పనున్నట్లు తెలిపారు.  ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ప్రత్యేక టిక్కెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సురక్షిత ప్రయాణంతో పాటు భక్తుల ఆరోగ్యం కోసం  అలిపిరి వద్ద, తిరుపతి బస్టాండ్‌లో  ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  గరుడ సేవ నాడు  విజయనగరం, కడప జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలలోని సర్వీసులను అదనంగా  తిరుమలకు నడిపి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదే రోజు  ప్రతి సర్వీసుకు డ్రై వర్‌తో పాటు కండక్టర్‌ను ఏర్పాటు చేసి టిక్కెట్లు బస్సులోనే ఇచ్చేలా  చర్యలు తీసుకున్నామని తెలిపారు.  ఇతర జిల్లాల నుంచి  అదనంగా కండక్టర్లు, డ్రై వర్లను గరుడ సేవలో  విధులు నిర్వహించేలా  చర్యలు చేపట్టామన్నారు.   స్థానికులను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ  రైల్వేస్టేసన్, బస్టాండ్‌ లక్ష్మీపురం, బైరాగిపట్టెడ, ఎంఆర్‌పల్లి, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ మీదుగా అలిపిరి వరకు రెండు బస్సులు నడుపుతున్నామన్నారు.  తిరుమల టిక్కెట్‌ తీసుకున్న వారు ఈ సర్వీసులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అలాటే  గరుడ సేవ భక్తుల కోసం  అలిపిరి నుంచి రైల్వేస్టేషన్, బస్టాండ్‌ వంటి ప్రాంతాలకు  ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ 40 ప్రత్యేక సర్వీసులను నడిపి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.  ఇదే రోజు పోలీసు, టీటీడీ సహకారంతో  ఆర్టీసీ సిబ్బందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి  తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రతి మలుపు వద్ద  డ్రై వర్లకు సిగ్నల్స్‌ ఇస్తూ సురక్షత ప్రయాణం సాగించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.  ఘాట్‌ రోడ్డులో ఎక్కడైనా  ట్రాఫిక్‌ జామ్‌ అయితే సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మొబైల్‌ టీంను అందుబాటులో  ఉంచడం జరుగుతుందన్నారు.  ఇవే కాకుండా తమిళనాడు నుంచి ప్రత్యేకంగా 130 సర్వీసులతో పాటు తమిళనాడుకు చెందిన 130 బస్సులతో  బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  అలాగే ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా బెంగళూరు సర్వీసులను  ఈనెల 7,8వ తేదీల్లో అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన  బస్టాండ్‌ వద్ద వరకు నడుపుతున్నామన్నారు. ఆ సర్వీసులలో వచ్చిన వారి కోసం  అక్కడి నుంచి  బస్టాండ్‌ వరకు టౌన్‌ సర్వీసు ద్వారా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో  ఆర్టీసీ సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement