కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప నేక్‌నామ్ కళాక్షేత్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, కాబోయే కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు ముఖ్య అతి థిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు. బాడీబిల్డిం గ్ క్రీడ సాధన కష్టంతో పాటు ఖర్చుతో కూడుకోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదన్నా రు. ప్రసుత్త పరిస్థితుల్లో ఆరోగ్యం, అందం కోసం ఈ క్రీడకు ఆదరణ పెరుగడం శుభపరిణామమన్నా రు. జిల్లాలో గతంలో నాలుగుసార్లు విజయవంతం గా రాష్ర్ట స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించి న అనుభవం అసోసియేషన్‌కు ఉందన్నారు. వికలాంగుల విభాగంలో సైతం జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులు జిల్లాలో ఉన్నారన్నారు.
13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొనడం సంతోషకరమని కడప ఎమ్మెల్యే, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ ఎస్.బి. అంజద్‌బాషా అన్నారు. కడప జిల్లాకు బాడీబిల్డింగ్ క్రీడలో ప్రత్యేక స్థానం ఉందని, జాతీయస్థాయి క్రీడాకారులు ఇక్కడ ఉండటంతో పాటు కేవలం క్రీడకే పరిమితం కాకుండా సామాజిక సేవలో పాల్గొనడం సంతోషకరమని ఏపీ బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, చీఫ్ రెఫరీ ఆనంద్‌కుమార్ తెలిపారు. అనంతరం 55 కిలోల నుంచి 90 కిలోల విభాగాల్లో దాదాపు 100 మందిపైగా క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు. డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మ న్ రాజారత్నం ఐజాక్, ప్రెసిడెంట్ ఎస్‌కేఎస్ మహ్మ ద్, కార్యదర్శి షంషీరుద్దీన్, రెఫరీలు భాస్కరన్, పవన్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, సతీష్, న్యామతుల్లా, ప్రముఖులు సలావుద్దీన్, అబ్దుల్‌ఖాదర్, షాజహా న్, ఇలియాస్‌బాషా, రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ముగిసిన వాలీబాల్ పోటీలు
Published Mon, Jun 9 2014 2:31 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement