వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థులకు సూచనలు
Published Thu, Jan 30 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
ఏలూరు ( ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్‌ఏ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కలెక్టర్ సిద్ధార్థజైన్ బుధవారం పలు సూచనలిచ్చారు.
అభ్యర్థులు హల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ, బ్లాక్ బాల్ పెన్‌లతో పరీక్షా కేంద్రాలకు సమయం కంటే గంట ముందుగా రావాలి.
హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా లేకపోవడం, సంతకం లేకపోవడం వంటి లోపాలు ఉంటే మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు తప్పనిసరిగా ఇవ్వాలి.
పరీక్ష ప్రారంభమైన తర్వాత వచ్చే అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష పూర్తయ్యే వరకూ కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదు.
సమాధానపత్రాలు, సూచనలను జాగ్రత్తగా చదువుకోవాలి. సమాధాన పత్రంలో హాల్‌టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం పేరు తదితర వివరాలను ఆయా స్థానాల్లో రాయాలి. అన్నీ స క్రమంగా రాయకపోతే జవాబు పత్రాన్ని విలువలేనిదిగా పరిగణిస్తారు.
అభ్యర్థులు సమాధాన పత్రంపై నిర్దేశిత ప్రాంతంలో సంతకం చేయాలి.
ఓఎంఆర్ షీటు ఒకటి ఒరిజనల్, మరొకటి డూప్లికేట్ ఉంటాయి. పరీక్ష అనంతరం అభ్యర్థులు డూప్లికేట్ షీట్‌ను తీసుకువెళ్లవచ్చు.
ప్రశ్నాపత్రంపై ముద్రించిన సిరీస్‌ను సమాధాన పత్రంలో నిర్దేశిత ప్రాంతంలోని వృత్తంలో పెన్‌తో దిద్దాలి.
ప్రశ్నాపత్రంపై ఏ విధమైన రాతలు రాయకూడదు.
సమాధాన పత్రంలో జవాబును మార్పు చేసేందుకు వైట్నర్, బ్లేడ్, రబ్బరుతో ఏవిధమైన సర్దుబాట్లు చేయకూడదు.
పరీక్షకు కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు అనుమతించరు.
ఈ సూచనలు పాటించని అభ్యర్థి సమాధాన పత్రాన్ని రద్దుచేయడమే కాకుండా శిక్షార్హులుగా పరిగణిస్తా రని కలెక్టర్ తెలిపారు.
Advertisement
Advertisement