ధ్రువీకరణ పత్రాల పరిశీలన
Published Wed, Feb 26 2014 3:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:గ్రామ రెవిన్యూ అధికారులు, సహాయకుల నియామకాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. ధ్రువపత్రాల పరిశీలన ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. వీఆర్‌ఏలకు నియోజకవర్గానికి ఒక కౌంటర్ చొప్పున పది కౌంటర్లు ఏర్పాటు చేయగా, వీఆర్వోలకు ఒక కౌంటర్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. వీఆర్‌వో పోస్టులకు సంబంధించి 77 పోస్టులకు 75మంది అభ్యర్థుల దృవపత్రాలను పరిశీలించగా, వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి 176 పోస్టులకు 146మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అభ్యర్థుల రోస్టర్ సరిగా లేకపోవడంతో 30 మందిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 57మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 22 మందిని ఎంపిక చేశారు.
టెక్కలి డివిజన్ పరిధిలో 43మంది సర్టిఫికెట్లను పరిశీలించి 36మందిని, పాలకొండ డివిజన్‌లో 44మంది సర్టిఫికె ట్లను పరిశీలించి 29మందిని ఎంపిక చేశారు. తొలిరోజు 75 మంది వీఆర్‌వోలు, 97 మంది వీఆర్‌ఏల ఎంపికలు జరిగింది. మిగిలిన 49 మంది ధ్రువపత్రాల పరిశీలన బుధవారం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు తాత్కాలిక ఉత్తర్వులు అందజేశారు. పూర్తిస్థాయిలో ఉత్తర్వులను కలెక్టర్ సౌర భ్‌గౌర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ధ్రువవపత్రాలను పరిశీలించి వారిలో డీఆర్‌వో నూర్‌భాషా ఖాసీం, ఏజేసీ షరీఫ్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ సురేష్, ఆంజనేయులు, ఏవోలు లక్ష్మణరావు, హేమసుందర్, గిరిబాబు, మండలాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.
Advertisement
Advertisement