కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. కడపలో 38, ప్రొద్దుటూరులో 12, రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. వీఆర్వో పరీక్షలు ఉద యం 10కి ప్రారంభమై 12 గంటలకు ముగిశాయి. ఈ పరీక్షల కోసం 28,661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 24,981 మంది (87.16 శాతం) హాజరు కాగా, 3,680 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కడప గ్లోబల్ కళాశాలలో వీఆర్‌ఏ పరీక్ష లు జరిగాయి. మొత్తం 1240 మంది దరఖాస్తు చేసుకోగా, 1119 మంది (90.24 శాతం) హాజరయ్యారు.
121 మంది హాజరు కాలేదు. కడప గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో వీఆర్వో పరీక్ష రాసిన పోరుమామిళ్లకు చెందిన మహీధర్ అనే అభ్యర్థి పరీక్ష ముగిశాక పొరపాటున సమాధానపత్రాన్ని తన వెంట తీసుకు వెళుతుండగా అధికారులు గుర్తిం చారు. నిబంధనల మేరకు ఆయనపై అనర్హత వేటు విధించారు. అలాగే పలువురు అభ్యర్థులు పరీక్షాకేంద్రాల వద్దకు సెల్‌ఫోన్లు, స్టడీ మెటీరియల్, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కడప ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పరీక్షా హాలులో ఓ టేబుల్‌పై కుప్పగా వేశారు.
పరీక్ష ప్రారంభానికి కొద్దిగా ముందు కేంద్రం వద్దకు చేరుకున్న కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గది ఎక్కడుందో వెతుక్కోవడానికి ఆందోళన పడ్డారు. మరికొందరు పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాలకు తాపీగా రావడంతో పోలీసులు వెనక్కి పంపివేశారు. పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు వరకు మాత్రమే హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండగా, కొందరు అభ్యర్థులు 9.30 గంటలకు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద హాల్ టిక్కెట్ల కోసం ప్రయత్నించి విఫలయ్యారు. నామినల్ రోల్స్‌లో అభ్యర్థుల సంతకాలు వేలిముద్రలు తీసుకోవాల్సి ఉండగా, అవగాహన లేని కొందరు ఇన్విజిలేటర్లు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి తెలుసుకున్నారు. మహిళా అభ్యర్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం కనిపించింది.
పరీక్షా కేంద్రాల సందర్శన
కలెక్టర్ శశిధర్ కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించా రు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ హరిత ఉన్నారు. డీఆర్వో ఈశ్వరయ్య గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, మదీనా ఇంజనీరింగ్ కళాశాల, జెడ్పీ ఉర్దూ హైస్కూలు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలను సందర్శించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డి, ఏపీపీఎస్‌సీ సహాయ కార్యదర్శి రామనాధంశెట్టి పర్యవేక్షించారు.
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతం
Published Mon, Feb 3 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement