దక్షిణాఫ్రికాలో వరంగల్‌వాసి మృతి | Warangal Man Died in South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో వరంగల్‌వాసి మృతి

Published Mon, Aug 19 2013 1:03 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

దక్షిణాఫ్రికాలో వరంగల్‌వాసి మృతి - Sakshi

దక్షిణాఫ్రికాలో వరంగల్‌వాసి మృతి

చిట్యాల, న్యూస్‌లైన్:   దక్షిణాఫ్రికాలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చిట్యాల మండలంఒడితల గ్రామానికి చెందిన మాచర్ల రాధ, రాయమల్లు దంపతుల కుమారుడు రాకేష్(23) బెంగళూరులో ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల క్రితం దక్షిణాఫ్రికాకు బదిలీ అయ్యాడు. కాగా ఐదురోజుల క్రితం అక్కడే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరుుతే రాకేష్ మరణవార్తను మూడు రోజుల వరకు  కంపెనీ అధికారులు తమకు చెప్పలేదని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యూరు. కాగా, ఆదివారం  గ్రామానికి  మృతదేహాన్ని తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement