మినిట్స్ బుక్ పట్టుకెళ్లిపోయిన కిర్లంపూడి ఎస్సై
వత్తాసు పలికిన జగ్గంపేట సీఐ
కిర్లంపూడి : సోమవరం పంపింగ్ స్కీం కు శనివారం సా యంత్రం నిర్వహిం చిన నీటి సంఘం ఎన్నిక రసాభాసగా మారింది. వైఎస్సార్ సీపీ తరఫున జట్ల వీరసదాశివరావు, టీడీపీ తరఫున జగ్గం పేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి జ్యోతుల చంటిబాబు, రైతుల తరఫున చిరిపిరెడ్డి శివనాగరాజు తమ ప్యానల్ సభ్యులతో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి పి.శంకర్‌నాయక్‌కు అందజేశారు. పంపింగ్ స్కీం ఆయకట్టు పరిధిలో చంటిబాబుకు భూమి లేదని, ఓటు హక్కు లేకుండా నామినేషన్ ఎలా చెల్లుబాటు చేస్తారని ఎన్నికల అధికారిని జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
ఎన్నిక ఏకగ్రీవం కాలేదని మినిట్‌బుక్‌లో రాయాలని వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుబట్టారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎన్నికల అధికారిని తమవెంట తీసుకుపోతుండగా, నవీన్‌తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్‌బుక్‌ను కిర్లంపూడి ఎస్సై బీవీ రమణ తీసుకెళ్లిపోయారు. దీనిపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగ్గంపేట సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని జ్యోతుల నవీన్‌తో చర్చించారు. ఎస్సైకి సీఐ ఫోన్ చేయగా, గంట తర్వాత మినిట్‌బుక్ లేకుండా ఎస్సై వచ్చారు. మినిట్‌బుక్‌ను ఎస్సై తీసుకెళ్లిపోయారని తమకు రాసివ్వాలని ఎన్నికల అధికారిని నవీన్ డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా రాసిచ్చేందుకు సీఐ ప్రోత్సహించడంపై నవీన్ మండిపడుతూ, ఎన్నికల అధికారిని తీసుకెళ్లిపోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవరం ఎన్నిక రసాభాస
Published Sun, Sep 13 2015 12:27 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement