టీడీపీ జెండాతో నీటిని పంపిణీ చేస్తున్న వాటర్ ట్యాంకర్
చిత్తూరు, పలమనేరు: ప్రజలకు మంచినీటిని ప్రభుత్వం ద్వారా సరఫరా చేసే ట్యాంకర్‌కు పసుపు జెండా కట్టుకుని, ఆ పార్టీ అభ్యర్థి ఫొటోలను అంటించుకుని తిరుగుతున్న వాటర్ ట్యాంకర్‌ను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం మండలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో మంచినీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ స్టార్టర్ చెడిపోయింది. దీనిని రిపేరు చేయించకుండా అక్కడి టీడీపీ నేతల ఆదేశాలతో ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రభుత్వం ద్వారా ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ నీటిని పక్క గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తన ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్నాడు. ఆ ట్రాక్టర్‌కు ముందు వైపు టీడీపీ జెండా, ట్యాంకర్‌కు అభ్యర్థి ఫొటోలను అంటించి మంచినీటి సరఫరా చేస్తుండడంతో గ్రామస్తులు నిలదీశారు. ఇలా నీటి సరఫరాతో ఓటర్ల ప్రలోభపెడుతున్నారని డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో అక్కడికి చేరుకున్న ట్రాక్టర్ యజమాని తమ ప్రభుత్వ పాలనలో ఇష్టం వచ్చినట్టు చేస్తామనడంతో వాగ్వాదానికి దారితీసింది. దీనిపై గ్రామస్తులు చిట్టిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి గ్రామీణనీటి సరఫరా, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో పాటు సిటిజన్ విజిలెన్స్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment