తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కోరినట్లు ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కోరినట్లు ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని దిగ్విజయ్ తమకు సూచించారని, కాంగ్రెస్ వల్లే తెలంగాణ వస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు చెప్పారు.
విభజన బిల్లు రేపు లేదా సోమవారం అసెంబ్లీకి రావొచ్చని, దీనిపై తక్షణమే సభలో చర్చించాలని పట్టుబడతామని గండ్ర తెలిపారు. విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చ జరగనుండగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఇప్పుడు సమైక్య తీర్మానం అనడం అసమంజసమని వివరించారు.