భువనగిరి, న్యూస్‌లైన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి మ నకు అవసరం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమె నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిం చడం తగదన్నారు. వేయి మంది తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాబోతుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించడం ఖాయమన్నారు. హైదరాబాద్ రాజధానిగా భద్రాచలంతో కూ డిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుం దని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటయ్యాక ప్రస్తుతమున్న *200ల పింఛన్‌ను వేయి రూపాయలకు పెంచుతామన్నారు.
భువనగిరి పట్టణ అభివృద్ధి కుంటు పడిం దని, దానిని అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఎలి మినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం కేవలం అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప దీని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పాల కులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు బంగారు తల్లి బాండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ ఏపూరు భా స్కర్‌రావు, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, తహసీల్ధార్ ధర్మయ్య, ఎంఈ ఓ బండారు రవివర్దన్, రచ్చబండ కమి టీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
సీఎం ఫొటో తొలగింపు
రచ్చబండ వేదికపై అధికారులు ఏర్పా టు చేసిన సీఎం బొమ్మ ఉన్న ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. సీఎం ఫొటోను తొలగించి ఆ స్థానంలో ఉప ముఖ్యమం త్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రచ్చబండ బ్యానర్‌పై కూడా సీఎం బొమ్మ ఉండవద్దని బీజేపీ, జేఏసీ నాయకులు ఆందోళన చేశారు.
తెలంగాణ వ్యతిరేక సీఎం మనకొద్దు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
Published Tue, Nov 26 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement