komati reddy raja gopal reddy
-
25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తే..: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పార్టీలోకి వస్తే తీసుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంత్రి పదవిని కూడా ఇస్తామని, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన పాపాల ప్రక్షాళనకు ఈ పదవి ఆయనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం హరీష్ రావుమరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావాల్సి ఉంటుందని షరతు విధించారు. అసెంబ్లీ లాబీల్లో రాజగోపాల్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ హరీష్ రావు‘రైట్‌పర్సన్ ఇన్ రాంగ్ పారీ్ట’అని, ఆయన కష్టపడతారని, ఇప్పుడున్న పారీ్టలో భవిష్యత్‌లేదని అన్నారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు లేవని, అది అట్టర్‌ఫ్లాప్ అవుతుందని, డబ్బులు పంచి జనాల కాళ్లు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీమంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీని నడపాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు, కడియం శ్రీహరి మాదిరిగా తమది అన్నింటికీ తలూపే జీ హుజూర్ బ్యాచ్ కాదని పేర్కొన్నారు. -
మమ్మల్నెందుకు పట్టించుకోరు.. బీజేపీలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం. వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు! పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ ఫైర్.. రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్‌షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్‌లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు. తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్‌లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేరుగా నడ్డా దృష్టికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. తీవ్ర అసంతృప్తి.. పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా -
తెలంగాణ బీజేపీకి దెబ్బ ఖాయమేనా?
-
ఈటల, కోమటిరెడ్డి ఎఫెక్ట్.. వెంటనే ఢిల్లీకి రావాలని కిషన్‌రెడ్డికి ఫోన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. దీంతో, హైదరాబాద్‌లో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది. ఇక, అంతకుముందే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని సూచించడంతో ఇప్పటికే కోమటిరెడ్డి హస్తినకు వెళ్లారు. ఈటల కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, వీరిలో జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. జేపీ నడ్డా రేపు(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. సంజయ్ సమక్షంలో చర్చ ఇదిలా ఉండగా.. నాగర్‌కర్నూల్‌లో నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్య గౌడ్ తదితరులు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిల ఢిల్లీ పర్యటన చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్లు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నేతలతో సంజయ్ విడివిడిగా సమావేశమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని వీడాలనుకుంటే ఆపొద్దు..! పార్టీలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు చర్చకు వచ్చినపుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని సంజయ్‌కు కొందరు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు కాకుండా.. లీకులిస్తున్న నాయకులకే అగ్రనేతలు అపాయింట్మెంట్లు ఇస్తున్నారంటూ ఓనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడాలనుకునే నాయకులను ఆపవద్దని సంజయ్‌కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. కాగా అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్కు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇది కూడా చదవండి: శేజల్‌తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్! -
ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి రండి.. బీజేపీలో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కంటే ముందే తెలంగాణలో పాలిటిక్స్ స్పీడ్ అందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక, తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, పార్టీలో బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈరోజు సాయంత్రం ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వీరిద్దరూ రేపు(శనివారం) అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో జరిగిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో వీరిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ కొనసాగింది. ఈ క్రమంలో మరుసటి రోజే వీరిద్దకి హస్తిన నుంచి పిలుపు రావడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్! -
ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మునుగోడులో, తెలంగాణ భవన్లో సంబురాలు జరుపుకుంటున్నాయి. ఇక, మునుగోడులో బీజేపీకి ఊహించని ఓటమి ఎదురైంది. మరోవైపు, ఎన్నికల ఫలితాల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. ఈ ఎన్నికల్లో నైతిక విజయం నాదే. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచింది. మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. డబ్బులు పంచేందుకు పోలీసులే సహకరించారు. పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించింది. మమ్మల్ని కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు. దేశ చరిత్రలో తొలిసారి రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలకు గురిచేశారు. అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కారు. అధికార యంత్రాంగం మొత్తం మునుగోడులోనే ఉంది. ప్రజల పక్షాన నా పోరాటం కొనసాగుతుంది. ఓవైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులకు గురిచేసింది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. మునుగోడు ఉన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇది కూడా చదవండి: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు! -
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే.. కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనను ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్లో సీఎం నుంచి బీ ఫామ్ అందుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే అని జోస్యం చెప్పారు. 'కేసీఆర్ నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. నాలుగు సార్లు నాకు బీ ఫామ్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్నా. తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి వమ్ము చేశాడు. బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా.. ఎలా అభివృద్ధి చేస్తుందో రాజగోపాల్ చెప్పాలి. ఇప్పటివరకు అభివృద్ధి కోసం ఆ పార్టీ ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. తన కాంట్రాక్టుల కోసం రూ.22వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మిస్తున్నాడు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మునుగోడులో మూడో స్థానానికే పరిమితం అవుతుంది. జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఒక్క ఓటుకు బీజేపీ రూ.30 వేలు పంచుతామని చెప్తోంది. నాయకుడు కాదు గెలిచేది, మునుగోడు ప్రజలే' అని పేర్కొన్నారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
-
నన్ను హోంగార్డుతో పోల్చారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
-
రాజగోపాల్ రాజీనామాతో కాంగ్రెస్‌కు నష్టమేమి లేదు: ఉత్తమ్
-
అమిత్‌షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు: రాజగోపాల్‌రెడ్డి
-
తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్
-
మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం
-
కోమటిరెడ్డి పార్టీని వీడతానని ఎక్కడా చెప్పలేదు: భట్టి విక్రమార్క
-
బీజేపీ వైపే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగ్గు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ పాలనకు ఎదురొడ్డి నిలిచే శక్తి కాంగ్రెస్‌కు లేదని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఈ ప్రకటనతో ఆయన కాంగ్రెస్ గూటిని వీడి కమలం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు అన్న అభిప్రాయం బలపడింది. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమయంలోనే తాను బీజేపీలో చేరాలని ఇంకా నిర్ణయించుకోలేదని, నియోజకవర్గంలో తన అనుచరులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాక ఓ నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రెండు మూడు రోజులుగా ఇలాంటి ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయంగా పెద్దగా భవిష్యత్ లేదన్న అభిప్రాయంలో ఉన్న ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. బుధవారం నాటి సమావేశానికి హాజరైన ఆయన దగ్గరి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు కూడా బీజేపీలో చేరడానికి మొగ్గు చూపారని అంటున్నారు. గురువారం మరోమారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ కావాలని, ఈ అంశంపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశాన్ని ముగించారని సమాచారం. -
మరో 24 గంటల గడువు..!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరో నోటీసు జారీ చేసింది. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని ఈ నెల 21న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు రాజగోపాల్ ఇచ్చిన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదు. సరైన సమాధానం ఇచ్చేందుకు ఆయనకు మరో 24 గంటల గడువిచ్చింది. రాజగోపాల్ ఇచ్చిన సమాధానంపై చర్చించేందుకు చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ కోచైర్మన్ శ్యాం మోహన్, కన్వీనర్ బి.కమలాకర్‌రావు, ఎంపీ నంది ఎల్లయ్య, సభ్యులు సంభాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాసరావులు హాజరయ్యారు. రాజగోపాల్ పంపిన మూడు పేజీల సమాధానంపై రెండున్నర గంటలపాటు చర్చించిన సభ్యులు ఈనెల 21న పంపిన షోకాజ్ నోటీసుకు సరైన సమాధానం ఇచ్చేందుకు మరో నోటీసు జారీ చేసింది. ‘మీకు పంపిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఈనెల 23లోపు ఇవ్వాల్సి ఉన్నా 24వ తేదీ మధ్యాహ్నం మాకు అందింది. మీరు పంపిన మూడు పేజీల వివరణను కమిటీ చదివింది. క్రమశిక్షణ సంఘం అడిగిన అంశాల్లోని ఒక్క పాయింట్‌కు కూడా మీరు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ నెల 21న విలేకరుల సమావేశంలో నేను రెండు గంటల్లో షోకాజ్‌కు సమాధానం చెబుతానని అంటూనే క్రమశిక్షణ సంఘాన్ని కూడా విమర్శించారు. తనకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని, ఇచ్చేందుకు వాళ్లెవరని ప్రశ్నించారు. మీకు షోకాజ్ అందిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. మీరు సరైన సమాధానం పంపలేదు. మళ్లీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీకు సమయం ఇస్తోంది. మరో 24 గంటల్లో మీకు అందిన షోకాజ్‌కు సరైన వివరణ ఇవ్వండి. లేదంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’అని సోమవారం ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. కాగా, రాజగోపాల్‌రెడ్డికి 24 గంటల సమయమిచ్చిన నేపథ్యంలో బుధవారం మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యే అవకాశాలున్నాయని, తుది నిర్ణయం అదే రోజు తీసుకుంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను.. రాజగోపాల్‌రెడ్డి వివరణ ఈనెల 21న తనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన మూడు పేజీల సమాధానంలో తాను కాంగ్రెస్‌కు క్రమశిక్షణ గల కార్యకర్తనని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పర్యటించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు తాను ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని రాజగోపాల్ పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలనుకుంటున్న తనకే షోకాజ్ నోటీసులెలా ఇస్తారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు టికెట్ల కారణంగానే భువనగిరి ఎంపీగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని, కేసీఆర్‌ను సవాల్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిచానని పేర్కొన్నట్లు తెలిసింది. కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు కొన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చని, అంతమాత్రాన షోకాజ్‌ల వరకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని క్రమశిక్షణ కమిటీని ప్రశ్నించినట్లు సమాచారం. -
వైఎస్‌ను ఎప్పటికీ అభిమానిస్తాం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను మరిచిపోమని, ఆయన్ను ఎప్పటికీ అభిమానిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రాయపోల్ సమీపంలో 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎన్నటికీ విస్మరించరని కొనియాడారు. వైఎస్సార్ మృతి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బాబు సీఎంగా ఉండి తెలంగాణకు చెందిన విలువైన భూములను ఇతరులకు కట్టబెట్టి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల చేస్తున్న ప్రకటనలను గమనిస్తే ఆయన మానసిక పరిస్థితి బాగా లేనట్లు అర్థమవుతోందన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగిందని, వచ్చే రాష్ట్రంలో అందరికీ తాగునీరు, సాగునీటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేటట్లు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ‘సాక్షి’ జనసభలో ఇచ్చిన హామీ మేరకు రాయపోల్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపీతో కలిసి ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సీమాంధ్రులు అడ్డుకుంటున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణను ఆపలేరన్నారు. రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్న పార్టీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాయపోల్ సర్పంచ్ పాశం అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు పి.కృపేష్, బి.మహిపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిట్టు కృష్ణ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు మంకాల దాసు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంజీవ, నాయకులు యాదయ్య, శంకర్‌గౌడ్, నరహరి, రాఘవేందర్రావు, రాయపోల్ ఉప సర్పంచ్ జి. బల్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తల నిరసన రాయపోల్‌లో ఎంపీ పాల్గొన్న సభ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేసిన తర్వాత తిరిగి ఎలా ప్రారంభిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు రావటానికి ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకి పంపించారు. -
తేడా వస్తే తరిమికొడతాం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏదైనా తేడావస్తే సీమాంధ్ర నాయకులను ఈ ప్రాంతం నుంచి తరిమికొడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఇబ్రహీంపట్నంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని సీఎం పగటి కలలు కంటున్నాడని, కానీ ఏర్పడి తీరుతుందన్నారు. సీఎం కిరణ్ అక్రమంగా మూడు వేల కోట్లు సంపాదించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్యాప్తు జరిపించి జైలుకు పంపిస్తామన్నారు. సీల్డు కవర్ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, సీఎం వైఖరి దున్నపోతుపై వానపడ్డట్టు ఉందని అన్నారు. సోనియాగాంధీపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించామని అన్నారు. టీడీపీకి నూకలు చెల్లాయి... టీడీపీ మునిగిపోయే పడవని, చంద్ర బాబు అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంద ని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. రెండెకరాల నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని చం ద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే బాబు గులాంగిరీకి స్వస్తి చెప్పాలని కోరా రు. సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొందరు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం మాని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఎంపీ సూచించారు. మల్రెడ్డి రంగారెడ్డి గతంలో మలక్‌పేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఆయనను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ఆశించిన అభివృద్ధి ఏదీ? 30 ఏళ్లుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అసమర్థుడని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా మంచిరెడ్డి గెలుపు నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం గా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీని, ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మార్కెట్ కమిటీని ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా దాసరి బాబూరావుతోపాటు పలువురు డెరైక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. -
సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారు
ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావ సభ ఆదివారం ఇక్కడ జరిగింది. దీనికి ఎంపీ కోమటిరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించామని తెలిపారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ని దోపిడీకి అవకాశం ఉండే రంగాలకు కేటాయిస్తోందని దుయ్యబట్టారు -
తెలంగాణ వ్యతిరేక సీఎం మనకొద్దు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి మ నకు అవసరం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమె నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిం చడం తగదన్నారు. వేయి మంది తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాబోతుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించడం ఖాయమన్నారు. హైదరాబాద్ రాజధానిగా భద్రాచలంతో కూ డిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుం దని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటయ్యాక ప్రస్తుతమున్న *200ల పింఛన్‌ను వేయి రూపాయలకు పెంచుతామన్నారు. భువనగిరి పట్టణ అభివృద్ధి కుంటు పడిం దని, దానిని అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఎలి మినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం కేవలం అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప దీని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పాల కులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు బంగారు తల్లి బాండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ ఏపూరు భా స్కర్‌రావు, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, తహసీల్ధార్ ధర్మయ్య, ఎంఈ ఓ బండారు రవివర్దన్, రచ్చబండ కమి టీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. సీఎం ఫొటో తొలగింపు రచ్చబండ వేదికపై అధికారులు ఏర్పా టు చేసిన సీఎం బొమ్మ ఉన్న ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. సీఎం ఫొటోను తొలగించి ఆ స్థానంలో ఉప ముఖ్యమం త్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రచ్చబండ బ్యానర్‌పై కూడా సీఎం బొమ్మ ఉండవద్దని బీజేపీ, జేఏసీ నాయకులు ఆందోళన చేశారు.