సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మునుగోడులో, తెలంగాణ భవన్‌లో సంబురాలు జరుపుకుంటున్నాయి. ఇక, మునుగోడులో బీజేపీకి ఊహించని ఓటమి ఎదురైంది.
మరోవైపు, ఎన్నికల ఫలితాల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. ఈ ఎన్నికల్లో నైతిక విజయం నాదే. మునుగోడులో టీఆర్‌ఎస్ అధర్మంగా గెలిచింది. మద్యం, డబ్బు పంచి టీఆర్‌ఎస్ పార్టీ గెలిచింది. డబ్బులు పంచేందుకు పోలీసులే సహకరించారు.
పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించింది. మమ్మల్ని కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు. దేశ చరిత్రలో తొలిసారి రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలకు గురిచేశారు. అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కారు. అధికార యంత్రాంగం మొత్తం మునుగోడులోనే ఉంది. ప్రజల పక్షాన నా పోరాటం కొనసాగుతుంది. ఓవైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులకు గురిచేసింది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. మునుగోడు ఉన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారు.
ఇది కూడా చదవండి: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు!
Comments
Please login to add a commentAdd a comment