ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావ సభ ఆదివారం ఇక్కడ జరిగింది. దీనికి ఎంపీ కోమటిరెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పీఆర్‌టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించామని తెలిపారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ని దోపిడీకి అవకాశం ఉండే రంగాలకు కేటాయిస్తోందని దుయ్యబట్టారు
సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారు
Published Mon, Dec 2 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement