సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పార్టీలోకి వస్తే తీసుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంత్రి పదవిని కూడా ఇస్తామని, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసిన పాపాల ప్రక్షాళనకు ఈ పదవి ఆయనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం హరీష్ రావుమరో 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావాల్సి ఉంటుందని షరతు విధించారు.
అసెంబ్లీ లాబీల్లో రాజగోపాల్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ హరీష్ రావు‘రైట్‌పర్సన్ ఇన్ రాంగ్ పారీ్ట’అని, ఆయన కష్టపడతారని, ఇప్పుడున్న పారీ్టలో భవిష్యత్‌లేదని అన్నారు. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు లేవని, అది అట్టర్‌ఫ్లాప్ అవుతుందని, డబ్బులు పంచి జనాల కాళ్లు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీమంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్‌ఎస్ పార్టీని నడపాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు, కడియం శ్రీహరి మాదిరిగా తమది అన్నింటికీ తలూపే జీ హుజూర్ బ్యాచ్ కాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment