సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కంటే ముందే తెలంగాణలో పాలిటిక్స్ స్పీడ్ అందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక, తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, పార్టీలో బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈరోజు సాయంత్రం ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వీరిద్దరూ రేపు(శనివారం) అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు.
ఇదిలా ఉండగా.. ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో జరిగిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో వీరిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ కొనసాగింది. ఈ క్రమంలో మరుసటి రోజే వీరిద్దకి హస్తిన నుంచి పిలుపు రావడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment