సత్వరాభివృద్ధికి సహకరిస్తాం | we support to total ap , telangana states -ata | Sakshi
Sakshi News home page

సత్వరాభివృద్ధికి సహకరిస్తాం

Published Tue, Jul 8 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

సత్వరాభివృద్ధికి సహకరిస్తాం

సత్వరాభివృద్ధికి సహకరిస్తాం

ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సహజ వనరులను ఉపయోగించుకుని సత్వర అభివృద్ధి దిశగా ఉభయ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన అమెరికా తెలుగు సంఘం(ఆటా) వేడుకల్లో భాగంగా నిర్వహించిన రాజకీయ వేదిక చర్చా కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు.

మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రసమయి బాలకిషన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆటా వేడుకల్లో చివరగా ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమం, తెలంగాణ బోనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కాగా, వరంగల్ జిల్లా గర్మిళ్లపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సుధాకర్ పెరికారీని ఈ వేడుకల్లోనే ఆటా నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2015 జనవరి నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు.     
 - షికాగో(అమెరికా) నుంచి సాక్షి ప్రతినిధి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement