పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజ ధాని ప్రాంతంలో భవిష్య త్తు అవసరాలకోసం 25 వేల నుంచి 30 వేల ఎకరాలు అవసరమవుతుందని ఏపీ పురపాలక శాఖ మం త్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు తదితర నిర్మాణాలకు ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 200 నుంచి 300 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భూమిని సేకరించనున్నామన్నారు. ప్రయివేటు భూములకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి తీసుకోవడం, లేక ప్రయివేట్, పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి పరిచిన భూమిలో యజమానికి వాటా కల్పిస్తూ సేకరించడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.
రైతులకు ఏ నిష్పత్తిలో వాటా కల్పించాలన్నదానిపైనా చర్చిం చాల్సి ఉందన్నారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రప్రభుత్వం పరిశీలించి మరోమారు అభిప్రాయాన్ని వివరిస్తుందన్నారు. అనంతరం భూములను ఎంపికకు మూడు నెలలు పడుతుందని వివరించారు.