
'తాత్కాలిక రాజధానిపై రెండు రోజుల్లో నిర్ణయం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని ఎక్కడనేది మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక రాజధాని అంశాన్ని త్వరలోనే తెలుపుతామని తెలిపారు. జూన్ ఏడు నాటికి ముఖ్యమైన కార్యాలయాలను గుంటూరు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏపీ రాజధానికి సంబంధించి 15 వేల ఎకరాల భూమిని సమీకరించినట్లు మంత్రి తెలిపారు. మరో నెల రోజుల్లో మిగతా 50 శాతం భూమిని సమీకరిస్తామన్నారు.