నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ అంశంపై పేచీ పెడితే రాజీపడబోమని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం నిర్మల్‌కు వచ్చిన ఆయనకు గంజాల్ టోల్‌ప్లాజా వద్ద సంఘం పశ్చిమ జిల్లా అధ్యక్షుడు గాజుల రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. టపాసులు కాల్చారు. అనంతరం టీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు నివాసంలో సుమన్ విలేకరులతో మాట్లాడారు.
పార్లమెంట్‌లో బిల్లు పెట్టే సమయంలో తెలంగాణపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ, హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాలు లాంటి కుట్రలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని చెప్పారు. ఓ వైపు సీమాంధ్ర నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు లాబీయింగ్‌లు నిర్వహిస్తుంటే మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు జైత్రయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మల్‌లోని కొందరు నేతలు తామే నిజమైన తెలంగాణవాదులమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం సుమన్‌ను టీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. నాయకులు సుభాష్‌రావు, అతిక్‌అహ్మద్, గాజులరవి, డి.శ్రీనివాస్, లక్ష్మణచారి, అప్పాల వంశీ పాల్గొన్నారు.
‘తెలంగాణ’పై రాజీపడం
Published Tue, Dec 3 2013 4:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement