Royala Telangana
-
పదొంతుల సంబురం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజాకాంక్షకు కేంద్ర కేబినేట్ పట్టం కట్టింది. తెలంగాణ రాజకీయ పక్షాల ఒత్తిడి ఫలించింది. రా యల తెలంగాణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు గురువారం రాత్రి సంబరాల్లో మునిగిపోయా రు. జేఏసీ, తెలంగాణవాదులు, కాంగ్రెస్, టీఆ ర్ఎస్, విద్యార్ధి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి సంతోషాన్ని పంచుకున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బాణసంచా కాలచ్చడంతోపాటు స్వీట్లు పంపిణీ చేసి, కుంకుమ చల్లుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో పలు సెంటర్లు మార్మోగారుు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంద వినోద్‌కుమార్, నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు కుమారస్వామి, మేకల బాబురావు, మహమూద్, నసీంజహాన్, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తన ఇంట్లో కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. తెలంగాణ బొగ్గుగని కార్మికు ల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని బాణాసంచా కాల్చారు. మహబూబాబాద్ నెహ్రూ సెంటర్, జనగామ బస్టాండ్ సెంట ర్లలో తెలంగాణ స్వీట్లు పంపిణీ చేశారు. పరకాలలో ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆధర్యం లో తెలంగాణ సంబరాలు జరిగాయి. రాత్రి ఎనిమిదిన్నరకు మొదలైన సంబరాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. కాకతీయ యూని వర్సీటి విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో క్యాంపస్ ప్రాంగణం దద్దరిల్లింది. తెలంగాణ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, న్యా యవాదులు హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని కొవ్వత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు రహిమున్నిసా అమరవీరుల స్థూపాన్ని పట్టుకుని బోరున విలపించడం అందరినీ కలచివేసింది. బార్ అసోసియేషన్ నాయకుడు సహోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గంధం శివ, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. లేబర్‌కాలనీ, కొత్తవాడ, పోచమ్మమైదాన్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో చేరుకున్న తెలంగాణ వాదులు బాణాసంచా కాల్చారు, రంగులు చల్లుకున్నారు. టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు అనిశెట్టి మురళి ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. -
తిరగని ఆర్టీసీ చక్రం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం నిర్వహించిన బంద్‌తో జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. జిల్లాలోని 7 డిపోల్లో ఉన్న 739 బస్సులు గేటు దాటి బయటకు రాలేదు. తెలంగాణవాద కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సు చక్రం తిరగలేదు. రీజియన్‌లో రోజూవారీగా వచ్చే *60 లక్షల ఆదాయంపై ప్రభావం దీని పడింది. విద్యాసంస్థల మూసివేత ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేశాయి. ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలను కూడా మూసివేశారు. విద్యార్థులెవరూ హాజరుకాలేదు, అధ్యాపకులు, సిబ్బంది బంద్‌కు మద్దతుగా ర్యాలీలు తీశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయంగా జీఓఎం ఎలాంటి ప్రతిపాదన చేసినా అంగీకరించేది లేదని ఉద్యోగులు నిరసన ర్యాలీల్లో స్పష్టం చేశారు. జెడ్పీ కాంప్లెక్స్‌లో కార్యాలయాల బంద్ జిల్లా పరిషత్తు కార్యాలయ కాంప్లెక్స్‌లోని కార్యాలయాల సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వెంటనే 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రావు, ఏపాల సత్యనారాయణరెడ్డి, జలందేర్‌రెడ్డి, ఎ.చంద్రమౌళి, శరీఫ్, శివ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రాయల తెలంగాణను ఇక్కడి ప్రజలు ఆమోదించబోరని ఇంటర్ విద్య జేఏసీ జిల్లా చైర్మన్ గార్లపాటి అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. బంద్‌లో భాగంగా నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.నర్సిరెడ్డి, ఎర్ర అంజయ్య, టి.సుధారాణి, శిల్ప, డాక్టర్ అన్సారి, కె.కృష్ణయ్య, పద్మావతి, టీఎల్.నారాయణ, శివకోటి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బంద్ సంపూర్ణం
రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా టీఆర్ఎస్ పిలుపు మేరకు గురువారం జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వయంగా బంద్‌లో పాల్గొని పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు. జాతీయ రహదారులతో పలుచోట్ల రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలతో నిరసన హోరెత్తింది. పలుచోట్ల సీపీఐ, బీజేపీ, టీజేఏసీ అనుబంధ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లావ్యాప్తంగా 151 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ పిలుపు మేరకు జరిగిన బంద్ పిలుపులో పార్టీ ముఖ్య నేతలు గురువారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావు, దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు గజ్వేల్, సంగారెడ్డి ఆర్టీసీ డిపోల ఎదుట తెల్లవారుజామునే బైఠాయించారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సంగారెడ్డిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ బంద్‌ను పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యులు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ఎదుట రాస్తారోకోలో పాల్గొన్నారు. సంగారెడ్డి శివారులోని కల్పగూరు మంజీర డ్యాంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జలదీక్షకు దిగారు. మెదక్‌లో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఎన్జీవోలు నిరసన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేటలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అడ్వకేట్ జేఏసీతో పాటు పలు సంఘాలు నిరసన తెలిపాయి. పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ భారీగా ర్యాలీ నిర్వహించాయి. పటాన్చెరు పారిశ్రామికవాడలో బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే పటాన్చెరు బస్టాండు బస్సులు లేక బోసిపోయింది. పరిశ్రమల్లో కార్మికులు లేక ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు. నర్సాపూర్, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోహీర్ చౌరస్తా, దిగ్వాల్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై తెలంగాణవాదులు బైఠాయించారు. రాజీవ్ రహదారిపై ములుగు, కుకునూరుపల్లి వద్ద రాస్తారోకో చేశారు. జోగిపేటలోనూ సుమారు రెండు గంటల పాటు నాందేడ్-అకోలా రహదారిపై రాస్తారోకోకు దిగారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరులో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలోని 7 డిపోల పరిధిలో 570 బస్సులు నిలిచిపోవడంతో ఆర్టీసీకి రూ.40లక్షల మేర ఆదాయం కోల్పోయింది. -
‘తెలంగాణ’పై రాజీపడం
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ అంశంపై పేచీ పెడితే రాజీపడబోమని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం నిర్మల్‌కు వచ్చిన ఆయనకు గంజాల్ టోల్‌ప్లాజా వద్ద సంఘం పశ్చిమ జిల్లా అధ్యక్షుడు గాజుల రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. టపాసులు కాల్చారు. అనంతరం టీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు నివాసంలో సుమన్ విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో తెలంగాణపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ, హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాలు లాంటి కుట్రలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని చెప్పారు. ఓ వైపు సీమాంధ్ర నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు లాబీయింగ్‌లు నిర్వహిస్తుంటే మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు జైత్రయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మల్‌లోని కొందరు నేతలు తామే నిజమైన తెలంగాణవాదులమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సుమన్‌ను టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. నాయకులు సుభాష్‌రావు, అతిక్అహ్మద్, గాజులరవి, డి.శ్రీనివాస్, లక్ష్మణచారి, అప్పాల వంశీ పాల్గొన్నారు. -
సీఎం ఇష్టానుసారం దోచుకుంటున్నారు!
కిరణ్‌పై కిషన్‌రెడ్డి మండిపాటు బీజేపీ నేతలతో బెరైడ్డి భేటీ సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితిని ఆసరా చేసుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇష్టానుసారం దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ దొరికినంత దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత గోవింద్ అశోక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయల తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టంచేశారు. రాయల తెలంగాణను వ్యతిరేకించండి: బెరైడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బెరైడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారమిక్కడ బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవలి వరకు సమైక్యమన్న కొందరు నేతలు ఇప్పుడు రాయల తెలంగాణ పాట పాడుతున్నారని, దీన్ని ఆమోదించవద్దని కోరారు. మజ్లిస్ నేతల ఒత్తిడి, హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ల పన్నాగమే ఈ ప్రతిపాదన అని ఆరోపించారు. మరోవైపు సమైక్యాంధ్ర సమితి నాయకుడు కుమార్ చౌదరి కిషన్‌రెడ్డిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని కోరారు. కాగా, పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ వసుధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నలుగురు యాసిడ్ దాడి బాధితులకు కిషన్‌రెడ్డి ఆర్థికసాయం అందించారు. ఢిల్లీ, బెంగళూరుల్లో యాసిడ్ దాడికి గురైన ప్రజ్ఞ, అర్చన, అను, సైనాలకు రూ.50 వేల చొప్పున నగదు అందజేశారు. -
రాయల తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం
పరిగి, న్యూస్‌లైన్: కర్నూలు, అనంతపురం జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సహా తెలంగాణ ప్రాంత మంత్రులందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మంత్రులు స్పందించకుంటే వారంతా సీమప్రాంత నేతల ప్రయోజనాల కోసం పాకులాడుతూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే భావిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి తుపాన్లకు పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంగు మారిన ధాన్యం, పత్తి, మొక్కజొన్నలను మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య మాట్లాడుతూ కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల వాటాలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ లేఖ తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు లాల్‌కృష్ణప్రసాద్, నయీముద్దీన్ ఉన్నారు -
రాయల తెలంగాణకు అసదుద్దీన్ ఓకే?
-
రాయల తెలంగాణకు అసదుద్దీన్ ఓకే?
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం సాయంత్రం భేటి అయ్యారు. మళ్లీ దేశ రాజధానిలో రాయల తెలంగాణ అంశాన్ని అసదుద్దీన్ తెరమీదకు తీసుకువచ్చారు. దాంతో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్.. సోనియా గాంధీతో జరిగిన భేటిలో ఓకే చెప్పినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోమని అసదుద్దీన్ తెలిపినట్టు సమాచారం. అయితే తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాయల తెలంగాణ అంశం మళ్లీ కొత్త వివాదానికి తెర లేపే అవకాశం కనిపిస్తోంది. అసదుద్దీన్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణలో కూడా చిచ్చు రేపే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. -
పథకం ప్రకారమే రాష్ట్ర విభజన: ఎమ్మెల్యే శ్రీనివాసులు ధ్వజం
రాయల తెలంగాణ దిశగా కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇదంతా పక్కాగా వేసుకున్న ముందస్తు పథకం ప్రకారమే జరుగుతున్నట్టు కన్పిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కేంద్రం ఈ రకంగా ఆలోచించడం దుర్మార్గమంటూ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. అంతా ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం మేరకే సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘అసలు రాష్ట్రాన్ని విభజిస్తున్నదెందుకు? తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించడానికే కదా! మరి అలాంటప్పుడు ఇలా రాయల తెలంగాణ అంటూ రాయలసీమను ఎందుకు, ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారు? సీమకు మాత్రం సెంటిమెంట్ ఉండదా?’’ అంటూ ధ్వజమెత్తారు. కర్నూలును తెలంగాణలో కలపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై కూడా శ్రీనివాసులు ఆగ్రహం వెలిబుచ్చారు. సీమకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఏదో చెబితే అది సీమ ప్రజలందరి అభిప్రాయం అవుతుందా అని ప్రశ్నించారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టును ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే దానిపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ప్రాంతాల పరిస్థితేమిటి? సముద్రం నీళ్లు తప్ప వారికి మరో దిక్కుండని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి వాస్తవిక సమస్యలను అసలు పరిగణనలోకి తీసుకోరా?’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానం తీరును తీవ్రంగా నిరసించారు. -
రాయల తెలంగాణకే కర్నూలు జిల్లా నేతలు సై!
సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలపాలంటూ గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగిన కారణాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఈ మేరకు వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆమెతో సమావేశం కానున్నారు. ‘రాయల తెలంగాణపై అభిప్రాయం చెప్పేందుకు’ వారిప్పటికే అధినేత్రి అపాయింట్మెంట్ కోరినట్టు, ఆమె కార్యాలయం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది! దిగ్విజయ్‌తో కర్నూలు నేతల భేటీ సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నేతలు దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతత్వంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణ వీరిలో ఉన్నారు. విభజనపై వ్యక్తమవుతున్న నిరసనలు, నేతల రాజీనామాలు, నదీ జలాల అంశం వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నా... విభజనకు తమ ప్రాంత ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, విభజన అనంతరం సీమ మరింత వెనుకబడుతుందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా ఉందని నేతలు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ ప్రాంతంలో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే తుంగభద్ర నీటి కేటాయింపుల విషయంలో సరిహద్దున ఉన్న మహబూబ్‌నగర్‌తో నిత్య పోరాటం చేస్తున్నామని, రాజోలిబండ వాటర్ స్కీం కింద సైతం వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తుందని, అక్కడ నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తే తమ జిల్లాకు చుక్క నీరందదని, తమ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుందని తెలిపారు. అందువల్ల తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వారు కోరినట్లు సమాచారం. రాజకీయ కోణంలో కూడా కర్నూలును తెలంగాణలో కలిపితేనే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మూడుగా విభజించాల్సిందే: కోట్ల రాష్ట్రం సమైక్యంగా ఉండటానికే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, అలా కుదరని పక్షంలో రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. లేనిపక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, హైదరాబాద్‌తోనే తాము కలిసుంటామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. నేడు సోనియాతో భేటీ.. కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలువనున్నారు. కోట్ల ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారని, సోనియా కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.