కిరణ్‌పై కిషన్‌రెడ్డి మండిపాటు
బీజేపీ నేతలతో బెరైడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితిని ఆసరా చేసుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇష్టానుసారం దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ దొరికినంత దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత గోవింద్ అశోక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయల తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టంచేశారు.
రాయల తెలంగాణను వ్యతిరేకించండి: బెరైడ్డి
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బెరైడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారమిక్కడ బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవలి వరకు సమైక్యమన్న కొందరు నేతలు ఇప్పుడు రాయల తెలంగాణ పాట పాడుతున్నారని, దీన్ని ఆమోదించవద్దని కోరారు. మజ్లిస్ నేతల ఒత్తిడి, హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ల పన్నాగమే ఈ ప్రతిపాదన అని ఆరోపించారు. మరోవైపు సమైక్యాంధ్ర సమితి నాయకుడు కుమార్ చౌదరి కిషన్‌రెడ్డిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని కోరారు. కాగా, పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ వసుధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నలుగురు యాసిడ్ దాడి బాధితులకు కిషన్‌రెడ్డి ఆర్థికసాయం అందించారు. ఢిల్లీ, బెంగళూరుల్లో యాసిడ్ దాడికి గురైన ప్రజ్ఞ, అర్చన, అను, సైనాలకు రూ.50 వేల చొప్పున నగదు అందజేశారు.
సీఎం ఇష్టానుసారం దోచుకుంటున్నారు!
Published Mon, Dec 2 2013 2:25 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement