* ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులు ?
* సెలవుల అనంతరం బయటపడిన వాస్తవాలు
* తమకెలాంటి సమాచారం లేదంటున్న అధికారులు
పార్వతీపురం: సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆడబిడ్డలను సొంత పిల్లల్లా చేరదీయాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమంగా తీర్చిదిద్దాలి. కానీ అక్కడ వారికి కొందరు కీచకుల వల్ల క్షేమం కొరవడుతోంది. పార్వతీపురం మండలంలోని డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్టు చర్చజరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ వ్యవహారం బయటకు రానీయకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. వేసవి సెలవులకు ఇళ్లకొచ్చిన ఆ పాఠశాల విద్యార్థులు చర్చించుకోవడంతో ఈ విషయం కాస్తా బయటకు వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్మాస్టర్ పి.పరశురాం వద్ద ప్రస్తావించగా... అటువంటి సంఘటన ఎవరి వద్ద నుండి... తన వరకు రాలేద న్నారు. పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి.అశోక్ కుమార్‌ల వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఐటీడీఏ డీడీ జి.విజయకుమార్ వద్ద ప్రస్తావించగా... తన నోటీసుకు రాలేదన్నారు. మరి నిప్పులేనిదే... పొగరాదుకదా... అన్నది ఇక్కడి వాదన.
అక్కడ 'సమ్'క్షేమమే!
Published Tue, Apr 26 2016 4:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement