సాక్షి ప్రతినిధి, తిరుపతి: రోజు విడిచి రోజు ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిది హత్యేనని బంధువులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒకరిది ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాగా మరొకరిది తిరుపతి రూరల్ మండలం సాయినగర్.
ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బైనబోయిన రతన్‌తేజ(20) ఆదివారం రాత్రి చంద్రగిరికి సమీపంలోని అగరాల వద్ద రోడ్డు పక్కన విగతజీవిగా ఉన్నాడు. ఈ యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించిన తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. కటికపల్లి బాలకృష్ణ అనే వ్యక్తి బైక్‌పై వస్తూ అగరాల వద్ద బోల్తా పడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు గాయాలపాలైన బాలకృష్ణను వా హనంలోకి ఎక్కించారు. బాలకృష్ణకు రక్తం కారడంతో బట్టలు కూడా తడిశాయి.
బాలకృష్ణను ఎక్కించుకున్న వెంటనే వాహనం కదిలింది. వాహనం లై టింగ్‌కు రోడ్డుపక్కన శవమై పడి ఉన్న రతన్‌తేజ కనిపించాడు. వెం టనే వాహనం దిగిన పోలీసులు తేజ మృతదేహాన్ని కూ డా ఆస్పత్రికి తరలించారు. అతడి ఫోన్‌లో ఉన్న నెం బర్ల ఆధారంగా పోలీసులు తేజ తండ్రి బాలమాల్యాద్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే ఆయన కారు అద్దెకు తీసుకుని ఆదివారం రాత్రికి తిరుపతి చేరుకుని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి తన కుమారునిగా నిర్ధారించుకున్నాడు.
తనతో ఎవ్వరూ రాలేదని, తాను ఎవ్వరినీ ఢీకొట్టలేదని, తనకు తానే పడిపోయానని బైక్‌పై వెళుతూ గా యాలపాలైన బాలకృష్ణ చెబుతున్నాడు. తేజ మృతదేహం ఉన్న ప్రదేశంలో కనీసం రక్తం మరక కూడా లేదు. కేవలం తలకు మాత్రమే బలమైన గాయాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే గాయాలైన బాలకృష్ణకు రక్తం వస్తుంటే తేజకు ఎందుకు రక్తం రాలేదనేది ప్రశ్న. పైగా నుదుటిపై కుడి భాగాన ఆయువు పట్టుపై బలమైన గాయమైంది. తల వెనుక భాగంలో మెదడు ఉండే ప్రాంతంలో బలమైన గాయం ఉంది. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వెనుకా ముందు తలపైనే ఎందుకు గాయాలు అవుతాయనేది కూడా ఆలోచించాల్సి ఉంది. ఇతను రెండు నెలలుగా తిరుమలలోని రామ్‌బగీచా స్టూడియోలో పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి ఆరు గంటల సమయంలో తిరుపతిలోని ఒక మైదానంలో క్రికెట్ ఆడిన తరువాత అక్కడ క్రికెట్ ఆడేందుకు వచ్చిన రాజేష్ బైక్‌పై ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఆరున్నర సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న తేజ ఏడున్నర గంటలకు అగరాల వద్ద శవమై ఎలా కనిపిస్తాడనేది అంతుచిక్కని ప్రశ్న. బైక్‌పై డ్రాప్ చేసిన రాజేష్‌ను కానీ, అతను భోజనం చేసే మెస్ వారిని కానీ, స్టూడి యో వారిని కానీ, ఇంకా తేజ స్నేహితులను కానీ ఎందుకు పోలీసులు విచారించలేదనేది ఆలోచించాల్సి ఉంది. తేజ చనిపోవడానికి రెండు గంటల ముందు, రెండు గంటల తరువాత ఫోన్ కాల్స్ లిస్ట్ తీసి పరిశీలించాల్సిన అవసరం ఉంది.
చంద్రగిరికి సమీపంలో తన స్నేహితుని ఇంట్లో ఏదో గొడవ జరిగితే, ఆ గొడవ కు సంబంధించిన పంచాయితీ చేసిన వ్యక్తుల్లో తేజ కూడా ఉన్నాడనే వాదన ఉంది. ఈ విషయాన్ని కూడా పో లీసులు పట్టించుకోలేదు. పైగా సంఘటన జరిగి నా లుగు రోజులు గడిచినా పోస్టుమార్టం రిపోర్టు కూడా పోలీసులు తీసుకోలేదు. సంబంధిత ఎస్‌ఐని అడిగితే ఇంకా పోస్టుమార్టం రిపోర్టు తీసుకోలేదని సమాధానమిచ్చారు. మృతుని తండ్రి తన కుమారుని మృతి అనుమానాస్పదంగా ఉందని, సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఇక సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ నివాసి నందకిశోర్‌రెడ్డి(20) మంగళవారం ఉదయానికి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శవమై కనిపించాడు. అక్కడి ఆటోడ్రైవర్లు కిశోర్‌రెడ్డి చనిపోయి ఉన్నాడని చెబితే కాని పోలీసులు, తల్లిదండ్రులు గుర్తించలేదు. ఆర్టీసీ బస్టాం డ్ అంటే నిత్యం జనసమ్మర్థంతో ఉండే ప్రాంతం. ఏ చిన్న సంఘటన జరిగినా తప్పకుండా తెలుస్తుంది. ఎవరైనా బస్సు కింద పడిపోతే డ్రైవర్‌కు తెలియని పరిస్థితి ఉండదు.
ఈ యువకుడు కారు డ్రైవర్ శ్రీనివాసులురెడ్డి కుమారుడు. శ్రీనివాసులురెడ్డికి మూడు ఆటోలు ఉన్నా యి. వీటిని అద్దెకు తిప్పుతుంటాడు. అద్దెకు ఆటోలు తీసుకునే వారు ప్రతి రోజు సాయంత్రం అద్దె డబ్బులు ఇస్తారు. రోజూ లాగే నందకిశోర్‌రెడ్డి అద్దె డబ్బులకు వచ్చాడు. రాత్రి పదిన్నర వరకు ఇంటికి రాకపోవడంతో కిశోర్‌రెడ్డి తల్లి నాగులమ్మ కుమారుడికి ఫోన్ చేసింది. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. మరో గంట తరువాత ఫోన్ చేస్తే రింగవుతున్నా లిఫ్ట్ కాలేదు. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఎక్కడికి వెళ్లాడోననే ఆందోళనలో వారు ఉన్నారు. తెల్లవారుజామున చని పోయి ఉన్నట్లు పోలీసులకు స్థానిక ఆటో డ్రైవర్లు ఫోన్ చేసి చెప్పారు.
పోలీసులు చెబుతున్న ప్రకారం మద్యం మత్తులో ఇక్కడ పడిపోయి ఉంటాడని, ఆ తరువాత బస్సు డ్రైవర్లు చూసుకోకపోవడంతో వెనుక నుంచి మనిషిపైకి టైర్లు ఎక్కి ఉంటాయంటున్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైర్లు మనిషిపైకి ఎక్కితే శరీరం నుజ్జునుజ్జవుతుంది. సాధారణంగా ఎక్కడ యాక్సిడెంట్లను చూసినా టైర్ల కింద పడిపోయిన వారు చిధ్రమై పోతుంటారు.
గుర్తించేందుకు కూడా వీలులేని స్థితిలో శరీరం ఉంటుంది. మృతి చెందిన నంద కిశోర్‌రెడ్డి మృతదేహం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. రక్తం బొట్టు బయటకు రాలేదు. మృతదేహం చుట్టుపక్కల కూడా రక్తం మరకలు లేవు. మరి దీన్ని యాక్సిడెంట్ అని ఎలా అంటారు. ఎవరైనా ఆర్టీసీ ఆవరణలోనే హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒక్క రోజు తేడాతో ఒకే వయస్సు యువకులు వేరు వే రు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెం దడం వెనుక అరాచక శక్తుల ప్రమేయం ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీ సులు తమ దర్యాప్తునకు మరింత పదును పెట్టి నిజ మైన నిందితులను పట్టుకునే వైపు పరుగులు తీయాల్సి ఉంది. నగరంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
దర్యాప్తులో డొల్ల
Published Thu, Feb 6 2014 3:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement