ఏం ‘ప్లాన్’ వేశారో..! | What 'plan' was ..! | Sakshi
Sakshi News home page

ఏం ‘ప్లాన్’ వేశారో..!

Published Mon, Mar 23 2015 3:05 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

What 'plan' was ..!

ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో లెసైన్సు ప్లానర్లు మున్సిపల్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకర్లను బురిడీ కొట్టించారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపు 15 మంది బిల్డింగ్ లెసైన్స్ సర్వేయర్లు ఉన్నారు. వీరు పట్టణంలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి మున్సిపాలిటీకి వచ్చి చలానా తీసి టౌన్ ప్లానింగ్‌శాఖ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి.

తర్వాతే నిర్మాణపు పనులు చేపట్టాలి. ఇలా ప్రతి నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్‌శాఖ వారు బీఏ నెంబర్(బిల్డింగ్ అప్లికేషన్ నెంబర్)ను ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా ప్లాన్ తీసుకున్న భవన యజమాని పేరు, వారి వివరాలు అందులో ఉంటాయి. నిర్మాణం ప్లాన్ ప్రకారం చేస్తున్నారా లేక అతిక్రమించారా అన్న విషయం అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు.
 
పాత బీఏ నెంబర్లు....
 బ్యాంకులను బురడీ కొట్టిస్తున్న మున్సిపల్ లెసైన్స్ ప్లానర్లు మున్సిపల్ అధికారులు గతంలో నిర్మాణానికి ఇచ్చిన బీఏ నెంబర్‌ను వేస్తున్నారు. ఇలా మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ప్లాన్‌లు తయారు చేస్తున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో ఉన్న గృహాలకు రుణాలు ఇచ్చే ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో నకిలీ ప్లాన్లను సమర్పించి రుణాలు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
అధికారుల సంతకాలు ఫోర్జరీతో వెలుగులోకి
 ప్రొద్దుటూరు పట్టణం దొరసానిపల్లె రోడ్డు నెంబర్ 5/1289లో ఎస్.పుల్లయ్య అనే వ్యక్తి నకిలీ ప్లాన్‌తోపాటు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిని పరిశీలించారు. ఇందుకు సంబంధించి బిల్డింగ్ అప్లికేషన్ నెంబర్ 163/2014/జీ2 కింద 27-9-2014లో ప్లాన్ మంజూరు చేస్తున్నట్లు నకిలీ ప్లాన్‌లో పొందుపరిచారు. ఇందులో సిటీ ప్లానర్ శ్రీనివాసులు సంతకాలు ఫోర్జరీ చేశారు. అయితే ఆర్.సుభాన్ మున్సిపల్ లెసైన్స్ సర్వేయర్ కింద ఈ ప్లాన్ మంజూరు చేసినట్లు అందులో సీల్, సంతకం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ పి.నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అది నా సంతకం కాదు
నకిలీ ప్లాన్‌లో లెసైన్స్ మున్సిపల్ సర్వేయర్ సీల్ వేసిన పైభాగంలో సంతకం చేసింది తాను కాదని తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆర్.సుభా న్ వాపోతున్నారు. మున్సిపల్ కార్యాలయం రో డ్డులో ఉన్న లెసైన్స్ సర్వేయర్ శ్రీరాములు వద్ద తన సీల్ ఉంచానని తెలిపారు. కొన్ని ప్లాన్ అ ప్రూవల్‌కు సంబంధించి సంతకాలు చేశానని, కా నీ ఎస్.పుల్లయ్య పేరుతో మంజూరైన ప్లాన్‌లో ఉన్నది తన సంతకం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నకిలీ ప్లాన్లు ఎందుకంటే
మున్సిపల్ లెసైన్స్ సర్వేయర్లుగా ఉన్న ప్లానర్లు నకిలీ ప్లాన్లను తయారు చేయడం వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. లే అవుట్ కాని ప్రాంతాల్లో ప్లాన్ కావాలంటే 14 శాతం ఫీజు అధికంగా చెల్లించాలి. అలాగే మాస్టర్ ప్లాన్ ప్రాంతాల్లో ప్లాన్లు ఇవ్వరు కాబట్టి నకిలీ ప్లాన్లను పెట్టి బ్యాంకర్లను బురిడీ కొట్టించి రుణాలు తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా రూ.5లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్లు ఇస్తుండటంతో నకిలీ ప్లాన్ల దందా కొనసాగుతోంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement