సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ లోపే పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ లోపే పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. మొత్తం 40.52 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.
పోస్టల్ కార్యాలయాల ద్వారా జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లు అందజేస్తామన్నారు. ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఉన్నచోట రోజుకు 150 మంది చొప్పున వీటిని ఇస్తామని తెలిపారు. ఈనెల 12న సంక్రాంతి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి మృణాళిని చెప్పారు.