పెట్టుబడి నిధిపై అవగాహన కల్పించండి
అధికారుల ఆలోచన విధానం మారాలి
ఒక్కో ఇల్లు రూ. 2.50 లక్షలతో నిర్మాణం
కడప రూరల్ : పెట్టుబడి నిధి కింద మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 3 వేల చొప్పున రూ. 3 వేల కోట్లు మంజూరు చేసినప్పటికీ మహిళల్లో స్పందన రాలేదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. అధికారుల ఆలోచన విధానాల్లో మార్పు రావాలని సూచిం చారు. కొత్తగా గృహ నిర్మాణంలో ఇంటిని రూ. 2.50 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపా రు. బుధవారం ఆమె వివిధ అధికారక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు పథకాలపై సమీక్షించారు. సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేవంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు పాటుపడాలన్నారు. మహిళా సంఘాలు పెట్టుబడి నిధి ఎలా చేసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. సంఘాల వద్దకు ప్రతి సీసీ వెళ్లి పెట్టుబడి నిధిపై, జీవనోపాధులపై ఆసక్తి కలిగేలా అవగాహన కల్పిం చాలన్నారు. పెన్షన్ల పంపిణీలో 77.66 శాతం సాధించారని, ఇంకా 95 శాతం సాధించేందుకు అధికారులు పాటుపడాలన్నారు. జిల్లాలో 3.10 లక్షల ఇళ్లకుగానూ 2.77 లక్షల ఇళ్లకు జియో ట్యాగింగ్ చేపట్టామన్నారు. 2.72 లక్షల ఇళ్లకు ఆధార్ సీడింగ్ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు లక్షల గృహాలు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. నీరు-చెట్టు కింద 65 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి రూ. 105 కోట్ల ఇరిగేషన్, వాటర్‌షెడ్, ఉపాధి పథకం ద్వారా ఖర్చు చేశామన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందన్నారు. స్వచ్చ భారత్ కింద ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, సెర్ఫ్ సీఈవో సాల్మన్ ఆరోగ్యరాజ్, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, సుబ్రమణ్యం, సా యినాథ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ ఈ శ్రీనివాసులు, ఆయా శాఖల పాల్గొన్నారు.
పెట్టుబడి నిధి అవసరాల కోసం కాదు
కడప రూరల్ : పెట్టుబడి నిధి కుటుంబాల అవసరాల కోసం కాకుండా, జీవనోపాధుల వైపు మహిళా సంఘాలు ఆలోచించాలని మంత్రి కిమిడి మృణాళిని సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో మహి ళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పెట్టుబడి నిధిని జిల్లాలోని మూడు లక్షల మంది సభ్యుల్లో 40 శాతం మాత్రమే జీవనోపాధుల పెంపుకోసం వినియోగిస్తున్నారన్నారు. సెర్ఫ్ సీఈవో సాల్మన్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ మహిళలతో ముఖాముఖి వైఎస్సార్ జిల్లా నుంచే ప్రారంభించామన్నారు.
ఆర్థికంగా ఎదగాలి
కడప కార్పొరేషన్: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళి అన్నారు. స్థానిక పాతరిమ్స్లో నగర సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్ సెంటర్‌ను ఆమె సందర్శిం చారు. దుస్తులు కుట్టే మహిళలతో మాట్లాడారు. టైలరింగ్ యూ నిట్‌లలో సమస్యలుంటే చెప్పాలని, ప్రభుత్వం లో చర్చించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ టైలరింగ్ యూనిట్ల ద్వారా హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు 4.50 లక్షల యూనిపారం జతలు
వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం
కడప సెవెన్‌రోడ్స్ : స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి మృణాళిని అన్నారు. కడప నగర శివార్లలోని టీటీడీసీ కేం ద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈడబ్ల్యుఆర్సీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ర్ట గ్రామీణాభివృద్ది, గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని బుధవారం జిల్లా పర్యటనకు వచ్చారు. కడప నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ కేవీ రమణ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జా యింట్ కలెక్టర్ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో చిన్నరాముడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు అనిల్‌కుమార్, బాలసుబ్రమణ్యం, సాయినాథ్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
బలిజలను బీసీలుగా గుర్తించండి
బలిజలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జిల్లా బలిజ సంక్షేమ సంఘం సభ్యులు మంత్రి మృణాళినికి విన్నవించా రు. సంఘం అధ్యక్షులు గోపిశెట్టి నాగరాజ ఆధ్వర్యంలో బుధవారం మంత్రిని స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం సమర్పించా రు.ఈకార్యక్రమంలో నగర బలిజ సంఘం అధ్యక్షులు దండు వెంకట సుబ్బయ్య, నా యకులు కేవీ రావు, వీవీ చలపతి, విజయనరసింహులు, ఉమేశ్వరబాబు, శివప్రసాద్, అనిల్‌కుమార్, రాజమోహన్, చక్రధర్, సురేష్ పాల్గొన్నారు.