రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013తో పాటు రాష్ట్ర విభజన లక్ష్యాలు, కారణాలు, ఆర్థిక మెమోరాండం, విభజన పరిణామాల వివరాలను ఇవ్వలేమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం సుస్పష్టమని.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించడమేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి ఈ నెల 6న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి లేఖ రాశారు. ఇది ముసాయిదా బిల్లు మాత్రమేనని... దీనిపై క్లాజుల వారీగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టికల్ -3 ప్రకారం ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఇటువంటి అపరిపక్వ దశలో పై వివరాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ మంత్రిత్వ శాఖలు, భాగస్వాముల నుంచి వచ్చిన సమాచారాన్ని ఒకే డాక్యుమెంటుగా రూపొందించలేదన్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర మంత్రుల బృందానికి మాత్రమే ఇచ్చామన్నారు. కేంద్ర హోంశాఖ రాసిన ఈ లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో జతపరిచింది.
ఆర్థిక మెమోరాండం ఇవ్వలేం!
Published Sat, Jan 11 2014 2:12 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement