పార్లమెంటులో ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: ఎంపీ అనంత | will obstruct question hour, says ananta venkatrami reddy | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: ఎంపీ అనంత

Published Wed, Aug 14 2013 11:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

will obstruct question hour, says ananta venkatrami reddy

పార్లమెంటులో బుధవారం కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుని తీరుతామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే రాజీనామాలు సమర్పించామని, అందువల్ల ఆహార భద్రత బిల్లుపై జరిగే ఓటింగులో పాల్గొనే ప్రసక్తే తలెత్తదని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ మాత్రం కొంత భిన్నమైన స్వరం వినిపించారు. ఆహారభద్రత బిల్లు పేదల కోసం తీసుకొస్తున్న చట్టమని, అందుల్ల పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతివ్వం.. అడ్డుకోబోమని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తప్పనిసరి అయిన పక్షంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఆంటోనీ కమిటీని కోరుతానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement