
అలాంటి ప్రయత్నం జరిగింది: కోడెల
విజయవాడ: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సదస్సుపై అన్ని రంగాల ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. కడివెడు పాలలో ఒక చుక్క విషం చిమ్మినా మొత్తం చెడిపోతుందని, అలాంటి ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల తనకు వ్యతిరేకత లేదని, స్త్రీలను గౌరవిస్తానని అన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే, ప్రెస్ మీట్ ముగించి స్పీకర్ కోడెల వెళ్లిపోయారు. మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానంతో వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను శనివారం గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించి.. తర్వాత ఆమెను బలవంతంగా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే.