మగువలకే నగరాధిపత్యం
Published Sun, Mar 2 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
సాక్షి, రాజమండ్రి : శరవేగంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నగర పాలక సంస్థల మేయర్‌లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. గతంలో అధికారులు ఖరారు చేసిన డివిజన్‌ల రిజర్వేషన్‌లను నోటిఫై చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లు సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో రిజర్వేషన్ల వివరాలు....
కోర్టుకెక్కనున్న అసంతృప్తులు!
రిజర్వేషన్ల కేటాయింపులపై ఆయా వర్గాలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. డివిజన్‌ల రిజర్వేషన్లు గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారులు ప్రతిపాదించినవి కాగా ఓటర్ల జాబితాలను మాత్రం జనవరి ఒకటవ తేదీ నాటివి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అలాగే జిల్లాలో సీట్ల కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మండపేటను జనరల్‌కు కేటాయించడంపై ఆ ప్రాంత బీసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొందరు మరోసారి కోర్టుకు ఎక్కే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాగా రాజమండ్రి, కాకినాడ మేయర్ స్థానాలు జనరల్‌కు కేటాయిస్తారని భావించారు. కానీ జనరల్ మహిళకు కేటాయించడంతో వివిధ పార్టీల్లోని ఆశావహులైన నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది. మేయర్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నవారు అప్పుడే తమ ఇల్లాళ్లను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
మేయర్‌ల రిజర్వేషన్లు
కార్పొరేషన్ కేటగిరీ
రాజమండ్రి జనరల్ మహిళ
కాకినాడ జనరల్ మహిళ
మున్సిపాలిటీల చైర్ పర్సన్ల రిజర్వేషన్లు
మున్సిపాలిటీ కేటగిరీ
అమలాపురం జనరల్
తుని జనరల్
సామర్లకోట జనరల్
రామచంద్రపురం జనరల్
పిఠాపురం జనరల్
మండపేట జనరల్
పెద్దాపురం జనరల్
గొల్ల ప్రోలు (నగర పంచాయతీ) బీసీ జనరల్
ముమ్మిడివరం ( ॥) ఎస్సీ మహిళ
ఏలేశ్వరం ( ॥) ఎస్సీ మహిళ
కార్పొరేషన్లలో డివిజన్ల రిజర్వేషన్లు
కార్పొరేషన్ డివిజన్‌లు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ జనరల్
మహిళ
రాజమండ్రి 50 01 06 17 14 12
కాకినాడ 50 01 06 17 14 12
మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు
అమలాపురం 30 01 04 10 08 07
తుని 30 01 05 10 08 06
సామర్లకోట 30 01 05 10 08 06
రామచంద్రపురం 27 01 04 09 07 06
పిఠాపురం 30 01 05 10 08 06
మండపేట 29 01 03 10 08 07
పెద్దాపురం 28 01 02 09 09 07
గొల్ల ప్రోలు 20 01 03 07 06 03
ముమ్మిడివరం 20 01 05 07 05 02
ఏలేశ్వరం 20 01 05 07 05 02
Advertisement
Advertisement