- కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరుపులు
- పేద, మధ్యతరగతి వర్గాలను పట్టించుకోలేదని విమర్శలు
- పోలవరం ప్రాజెక్ట్ ఊసెత్తని ప్రభుత్వం
ఏలూరు : కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేకూర్చకపోగా.. వారిపై పెనుభారం మోపేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల బడ్జెట్ అంటూ కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఆ వర్గాలకు పెద్దగా ఒనగూరే ప్రయోజనాలు లేవని నిపు ణులు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్ర మే కేటాయించటంపై రైతులు పెదవి విరుస్తున్నారు. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గించటం వల్ల పెద్దగా ఉపయోగం లేదంటున్నారు. కాకినాడలో హార్డ్‌వేర్ హబ్ ఏర్పాటు వల్ల మన జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘పోలవరం’ ప్రస్తావన లేదు
కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు కనీస ప్రయోజనాలైనా కలిగే అవకాశం లేకుండాపోరుుందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నారుు. జాతీయ హోదా పొందిన బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు లేకపోవడం విమర్శలకు తావి స్తోంది. ఉభయగోదావరి రైతుల కలల ప్రాజెక్టుగా ఉన్న దీనికి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయిందన్న వాదన వినవస్తోంది. జిల్లా నుంచి ఓ రాజ్యసభ సభ్యురాలు, ఇద్దరు ఎంపీలున్నా ఈ ప్రాజెక్టుకు అదనపు నిధుల కేటాయించే దిశగా కృషి చేయకపోవడం రైతన్నలను నిరాశ పర్చిం ది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ఎన్నికల హామీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగుల పెదవి విరుపు
ఆదాయ పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు మాత్రమే పెంచటంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రూ.5 లక్షలు చేస్తేనే ఉపయోగం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనిపై కేంద్రం పునఃపరిశీలన చేయాలని వారు కోరుతున్నారు. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 71 శాతానికి పెంచటంతో వాటి ధరలకు రెక్కలొచ్చారుు.
సామాన్యుల బడ్జెట్
వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి సామాన్యులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు, వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణకు రూ.500 కోట్ల నిధి ఏర్పాటుతో రైతులకు న్యాయం జరుగుతుంది. ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో రాష్ట్రానికి ఎంతో మేలు.
-భూపతిరాజు శ్రీనివాస వర్మ, అధ్యక్షుడు, బీజేపీ జిల్లా శాఖ
సామాన్యులకు ఊరట
బడ్జెట్ సామాన్యులకు ఊరట నిచ్చింది. బ్రాండెడ్ వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఎవరిపైనా కొత్త భారాలు లేవు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం బాధాకరం. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.50 లక్షలకు మాత్రమే పెంచటం సమంజసంగా లేదు. దీన్ని రూ.5 లక్షలు చేస్తే బాగుండేది. -నేరెళ్ల రాజేంద్ర,
అధ్యక్షుడు, ఏలూరు మర్చంట్ ఛాంబర్
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు
పదేళ్లుగా చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థకు బీజేపీ బడ్జెట్‌తో జవసత్వాలు రానున్నాయి. వస్తు తయారీ, మౌలిక సౌకర్యాల రంగాల్లో రూ.2 లక్షల 50వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం అంటే పరోక్షంగా పేదలకు ఉపాధి అవకాశాలు చూపించటమే. వివిధ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఆయా రంగాలను మరింత బలోపేతం చేసే కృషి కన్పించింది.
-అంబికా కృష్ణ, అధ్యక్షుడు, టీడీపీ వాణిజ్య సెల్
పేదలకు ఒరిగిందేమీ లేదు
కేంద్ర బడ్జెట్‌లో పేదలకు ఒరిగే అంశాలేవీ లేవు. అంతా సంపన్న వర్గాలకు మేలు చేసేదిలా ఉంది. టీవీలు, ఎల్‌సీడీలు, సెల్‌ఫోన్ ధరలు తగ్గిస్తే పేదలకు, సామాన్యులకు లాభం లేదు. పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ పేదలు ఉపాధి కోల్పోతారు. -డేగా ప్రభాకర్,కార్యదర్శి, సీపీఐ జిల్లా శాఖ
ప్చ్.. ఉపయోగం లేదు
Published Fri, Jul 11 2014 1:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement