
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి 1 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
అయితే కొన్ని రోజులుగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు లోకేశ్, ఇతర నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం వెనక్కు తీసుకుందనే దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరల్డ్ బ్యాంక్ ప్రకటనతో టీడీపీ నేతల ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. దీంతో లోకేశ్, టీడీపీ నేతలు మరోసారి పరువు పొగొట్టుకున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment