జగన్‌తో బీసీ చైతన్య వేదిక నేతల భేటీ | ya jagan met with the BC mobility platform | Sakshi
Sakshi News home page

జగన్‌తో బీసీ చైతన్య వేదిక నేతల భేటీ

Published Wed, Sep 10 2014 1:12 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

జగన్‌తో బీసీ చైతన్య వేదిక నేతల భేటీ - Sakshi

జగన్‌తో బీసీ చైతన్య వేదిక నేతల భేటీ

రిజర్వేషన్లలో బీసీలకు న్యాయమైన వాటాకు కృషి చేయాలని వినతి
 
 హైదరాబాద్: రిజర్వేషన్లలో బీసీలకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలని బీసీ చైతన్య వేదిక(ఏపీ) రాష్ట్ర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసిన నేతలు వినతిపత్రం సమర్పించారు. బీసీలకు తమిళనాడులో 69, కర్ణాటకలో 72 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, మన రాష్ట్రంలో కేవలం 25 శాతం మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాపులను బీసీల్లో చేర్చితే తమకు ఇంకా అన్యాయం జరుగుతుందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, ఉప్పాల బాలాజీగౌడ్, ముద్దాడ గణేష్ భవానీ యాదవ్, జంపన ధనరాజ్, కందుల వీరనాగేశ్వరరావు, యలకల శ్రీనివాస్, గేదెల నరసింగమ్, జమ్ము కాశీ విశ్వనాథ్, జమ్ము నాగార్జున తదితరులు జగన్‌ను కలసిన వారిలో ఉన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement