తుపానును రాజకీయం చేస్తున్నారు | YCP Bhumana Karunakar Reddy Fires on AP Govt | Sakshi
Sakshi News home page

తుపానును రాజకీయం చేస్తున్నారు

Published Thu, Oct 18 2018 3:55 AM | Last Updated on Thu, Oct 18 2018 3:55 AM

YCP Bhumana Karunakar Reddy Fires on AP Govt  - Sakshi

ఆమదాలవలస: తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొం టుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిని గాలికి వదిలేసి తుపానును కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సిగ్గు చేటని వైఎ స్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి  మండిపడ్డారు. పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం తో కలిసి ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో  బుధవారం పర్యటించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొబ్బరి, మామిడి, జీడిమామిడి తదితర చెట్లు నేలకొరిగి అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్య క్తం చేశారు.

 వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగి రైతుల బతుకులను ఛిద్రం చేసిందన్నారు. ప్ర జలకు కనీస అవసరాలు లేకపోవడంతో ఆందోళనతో, ఆవేశంలో తిరగబడి రోడ్ల మీదకు వస్తుంటే దాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారన్నారు. టీడీపీ నాయకులు తుపాను నష్టాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయకుండా సొంత డబ్బా కొట్టుకుం టున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో బాధితుల కు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని.. దీన్ని కప్పిపుచ్చేందుకు ఒడిశా, ఇతర జిల్లా ల నుంచి కొంతమంది గూండాలు వచ్చి ప్రజల ను రెచ్చగొడుతున్నారని, అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని సాకులు చెప్తున్నారని ఆరోపించారు. 

బాధితుల సేవలో వైఎస్‌ఆర్‌సీపీ
ప్రజలకు సాయం అందించడంలో వైఎస్సార్‌ సీపీ ముందంజలో ఉందన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిం చి బాధితులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన పార్టీ అగ్ర నా యకులు తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్‌రావు, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు స్వచ్ఛందంగా బాధితులను ఆదుకొని వారికి సహా యం అందించారన్నారు. బాధిత గ్రామాల్లో వైఎ స్సార్‌సీపీ పర్యటించి ప్రజల అవసరాలను గుర్తిం చి బయటకు తెలియజేశారు కాబట్టే  రెండోసారి కూడా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయం అందించడు, ఎవరైనా సహాయం అందిస్తే తట్టుకోలేరని ఎద్దేవా చేశారు.  

ఆపదలో ఉన్న ప్రజలకు భరోసా అందించాలి : తమ్మినేని
ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం భరో సా కల్పించాలని, లేకుంటే జనాగ్రహానికి గురికా క తప్పదని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు తమ్మినేని సీతారాం హెచ్చరించారు. నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించా రు. మంత్రి అచ్చెన్నాయుడు బాధితుల వద్ద ఓట్లు కోసం మాట్లాడడం శోచనీయమన్నారు. మంత్రికి మతి భ్రమించిందన్నారు. ఓట్లు అడగడానికి వెళ్తున్నారా, బాధితులను ఆదుకోడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. మళ్లీ 30 ఏళ్లు తానే సీఎం అం టూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారన్నా రు. ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నామని, రెండు రోజుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రజ ల కోసం పోరాటం చేసేందుకు వైఎస్సార్‌ సీపీ ముందంజలో ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, నాయకులు సురవరపు నాగేశ్వరరావు, మూడడ్ల రమణ, బొణి గి రమణమూర్తి, దున్నాన సత్యనారాయణ, పేడాడ అశోక్‌  పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement