storm effected area
-
Bomb Cyclone: శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపాన్.. కోలుకోని అమెరికా (ఫొటోలు)
-
నగరంపై తుపాను ప్రభావం
-
తుపానును రాజకీయం చేస్తున్నారు
ఆమదాలవలస: తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొం టుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిని గాలికి వదిలేసి తుపానును కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సిగ్గు చేటని వైఎ స్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం తో కలిసి ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొబ్బరి, మామిడి, జీడిమామిడి తదితర చెట్లు నేలకొరిగి అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్య క్తం చేశారు. వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగి రైతుల బతుకులను ఛిద్రం చేసిందన్నారు. ప్ర జలకు కనీస అవసరాలు లేకపోవడంతో ఆందోళనతో, ఆవేశంలో తిరగబడి రోడ్ల మీదకు వస్తుంటే దాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారన్నారు. టీడీపీ నాయకులు తుపాను నష్టాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయకుండా సొంత డబ్బా కొట్టుకుం టున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో బాధితుల కు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని.. దీన్ని కప్పిపుచ్చేందుకు ఒడిశా, ఇతర జిల్లా ల నుంచి కొంతమంది గూండాలు వచ్చి ప్రజల ను రెచ్చగొడుతున్నారని, అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని సాకులు చెప్తున్నారని ఆరోపించారు. బాధితుల సేవలో వైఎస్ఆర్సీపీ ప్రజలకు సాయం అందించడంలో వైఎస్సార్ సీపీ ముందంజలో ఉందన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిం చి బాధితులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన పార్టీ అగ్ర నా యకులు తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్‌రావు, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు స్వచ్ఛందంగా బాధితులను ఆదుకొని వారికి సహా యం అందించారన్నారు. బాధిత గ్రామాల్లో వైఎ స్సార్సీపీ పర్యటించి ప్రజల అవసరాలను గుర్తిం చి బయటకు తెలియజేశారు కాబట్టే రెండోసారి కూడా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయం అందించడు, ఎవరైనా సహాయం అందిస్తే తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు భరోసా అందించాలి : తమ్మినేని ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం భరో సా కల్పించాలని, లేకుంటే జనాగ్రహానికి గురికా క తప్పదని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు తమ్మినేని సీతారాం హెచ్చరించారు. నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించా రు. మంత్రి అచ్చెన్నాయుడు బాధితుల వద్ద ఓట్లు కోసం మాట్లాడడం శోచనీయమన్నారు. మంత్రికి మతి భ్రమించిందన్నారు. ఓట్లు అడగడానికి వెళ్తున్నారా, బాధితులను ఆదుకోడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. మళ్లీ 30 ఏళ్లు తానే సీఎం అం టూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారన్నా రు. ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నామని, రెండు రోజుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రజ ల కోసం పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ ముందంజలో ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, నాయకులు సురవరపు నాగేశ్వరరావు, మూడడ్ల రమణ, బొణి గి రమణమూర్తి, దున్నాన సత్యనారాయణ, పేడాడ అశోక్ పాల్గొన్నారు. -
నేడు జననేత జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : హెలెన్ తుపాను విలయ తాండవానికి జిల్లా తల్లడిల్లింది. పచ్చని కోనసీమ కకావికలమైంది. ఎటుచూసినా హృదయ విదారకమైన దృశ్యాలే. కన్నకొడుకుల్లా పెంచుకున్న వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సిరులు కురిపించే బంగారుపంట నేలనంటింది. నిలువనీడనిచ్చే గూడు సుడిగాలికి ఎగిరిపోయింది. రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, కూలీలు ఇలా ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రకోపానికి గురై గుండెలవిసేలా రోదిస్తున్నారు. జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు మంగళవారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకుని, రావులపాలెం మీదుగా వెళ్లి కోనసీమలో పర్యటించనున్నారు. ఇదే రీతిలో గతంలో కూడా జిల్లా రైతులు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందే స్పందించేవారు. మూడేళ్ల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలతో చేతికొచ్చిన పంటలు కోల్పోయిన మెట్టరైతులకు అండగా నిలిచేందుకు జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత సాగుసమ్మె సమయంలోనూ వచ్చి అన్నదాతల్లో మనోధైర్యం నింపారు. వారి కోసం ఢిల్లీ వరకు పోరు సల్పారు. పోలవరం సాధన కోసం హరితయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత భారీ అగ్నిప్రమాదంలో సర్వస్వం బుగ్గిపాలై కట్టుబట్టలతో మిగిలిన పల్లం గ్రామవాసులను కూడా ఇదే రీతిలో పరామర్శించి అండగా నిలిచారు. పార్టీ తరపున ఆర్థికంగా ఆదుకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జననేత జైలుపాలైన సమయంలో జిల్లావాసులు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ జగన్ తరఫున జిల్లాలో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. సొంతజిల్లా కడప తర్వాత మహానేత వైఎస్ మాదిరిగానే తూర్పు గోదావరి వాసులపై జగన్ ప్రత్యేకాభిమానం చూపిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లా ప్రజలు ఆది నుంచి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రూట్ పరిశీలించిన జిల్లా నేతలు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజక వర్గాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటించనున్న ప్రాంతాలను పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు తదితరులు పాల్గొన్నారు.