ఆరేళ్లుగా ‘పాలిష్’ | Years 'Polish' | Sakshi
Sakshi News home page

ఆరేళ్లుగా ‘పాలిష్’

Published Sun, Oct 27 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

Years 'Polish'

 =బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా పలమనేరు
 =తడ నుంచి రవాణా అవుతున్న తమిళ బియ్యం
 =స్థానికంగా ఓ ముఠా కార్యకలాపాలు
 =బంగారుపేట నుంచి ఇక్కడికి పాలిష్ బియ్యం
 =గుడియాత్తం నుంచి బస్సుల్లో రోజూ రవాణా
 
 కల్తీ బియ్యం అక్రమ రవాణాలో అక్రమార్కుల అడ్డదారులు అధికారులనే నివ్వెరపరిచారుు. తీగలాగితే డొంకంతా కదిలిన వైనంగా నెల్లూరు జిల్లా తడ నుంచి కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు తమిళనాడు చౌకబియ్యం తరలుతున్న గుట్టు రట్టు అయియంది. పలమనేరులో ఒక ముఠా  ఆరు సంవత్సరాలుగా తమిళనాడు బియ్యూన్ని బంగారుపేటకు తరలించి పాలిష్ చేసి, మధ్యరకం బియ్యం కలిపి కిలో రూ.35కు అమ్ముతూ జేబులు నింపుకుంటోంది. ఈ అక్రమ రవాణాకు కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న పలమనేరును ఈ ముఠా అడ్డాగా మార్చుకుంది. శనివారం జరిగిన అధికారుల దాడుల్లో తమిళబియ్యం దొరికింది కొంతే అయినా అక్రమాల గురించి మాత్రం మంచి సమాచారమే దొరికింది. మొత్తం మీద ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తమిళ బియ్యానికి పాలిష్’ కథనంతో చేపట్టిన దాడులతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.         
 
పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరు కేంద్రంగా సాగుతున్న తమిళ బియ్యం అక్రమరవాణాపై పౌరసరఫరాలశాఖ అధికారులు శనివారం చేసిన దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అక్రమాలపై అధికారులకే ఆశ్చర్యం కలిగించే విషయూలు వెలుగులోకి వచ్చారుు. ఇక్కడికి నెల్లూరు జిల్లా తడ నుంచి భారీగా తమిళబియ్యం అక్రమంగా తరలివస్తున్నట్లు గుర్తించారు. వీటిల్లో చాలా లోడ్లు కర్ణాటకలోని బంగారుపేటకు వెళుతున్నారుు. కొంతమేరకు మాత్రమే పలమనేరు, వి.కోటకు వస్తున్నట్లు తెలిసింది. ఇక్కడికి అక్రమంగా తరలే తమిళబియ్యం, కల్తీ చేసి విక్రయించే ప్యాకింగ్‌లు ఆరేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
 
దాడులు నామమాత్రమే

 పలమనేరు ప్రాంతంలో ఎక్కడెక్కడ బియ్యం స్టాక్ పాయింట్లున్నాయి. ఈ అక్రమాల వెనుక ఉన్న ముఠా ఏది తదితర విషయాలపై పక్కా సమాచారం లేకుండా దాడులు చేపట్టడంతో  నామమాత్రంగా మారాయి. ఒక చోట భారీగా వివిధ బ్రాండ్ల పేరుతో ముద్రించిన ఖాళీ సంచులు, కల్తీ చేశాక ప్యాకింగ్ చేసే యంత్రాలను చూశాక అధికారులు నివ్వెర పోయూరు. ఈ వ్యాపారం భారీగానే సాగుతున్నట్లు గుర్తిం చారు. అధికారులు దాడులు చేపట్టేందుకు కొ న్ని గంటల ముందే స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి రెండు లారీల తమిళబియ్యూన్ని తరలిం చినట్లు అధికారులకు పక్కాసమాచారం అం దింది. విజిలెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారు లు దాడులు చేసి ఉన్నట్లయితే భారీగా అక్రమా లు బయటపడి ఉండేవని స్థానికులు అంటున్నారు.
 
తడ టూ బంగారుపేట్.....

 చెన్నైకి స్టీమర్లద్వారా చేరే తమిళ బియ్యాన్ని కొం దరు చిన్నబోట్లలో నింపుకొని సముద్రం గుం డా నెల్లూరు జిల్లాలోని తడకు చేరవేస్తున్నట్లు సమాచారం. అక్కడినుంచి యథేచ్ఛగా పది చ క్రాల లారీల్లో చిత్తూరు- పలమనేరు, వి.కోటల మీదుగా కర్ణాటకలోని బంగారుపేట్‌కు ఈ అక్ర మ రవాణా సాగుతోంది. ఈ క్రమంలో పలమనేరులోని కొన్ని స్టాక్ పాయింట్లకు సైతం ఇదే లారీల గుండా సరుకు అందుతోంది. ఈ బి య్యాన్ని సైజులవారీగా పాలిష్‌చేసే భారీ యం త్రాలు బంగారుపేట ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి పాలిష్ అరుున బియ్యం స్థానిక ముఠాకు చేరుతోంది. వీరు ఇక్కడ  రకరకాల మధ్యరకం బియ్యూన్ని కలిపి ప్యాకింగ్ చేసి విక్రరుుస్తున్నారు. ఒక ముఠా ఈ మొత్తం తతంగా న్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి పోలీసు ఉన్నతాధికారుల అండదండలున్నట్లు వినికిడి.
 
గుడియాత్తం నుంచి రోజూ బస్సుల్లోనే

 తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం నుంచి పలమనేరు పట్టణానికి రోజూ ప్రైవేటు బస్సుల్లోనే భారీగా తమిళ బియ్యం రవాణా అవుతోంది. పలమనేరుకు సమీపంలో గుడియూత్తం ఉండడంతో బస్సు సీట్ల కింద, టాప్ పైన , 30 కిలోల ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. బస్సు రాగానే కొందరు కూలీలు ఈ బియ్యాన్ని రిక్షాల్లో వేసుకుని స్టాక్ పాయింట్లకు తీసుకెళ్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement