industrial estate
-
పచ్చని గ్రామాలపై పరిశ్రమల పంజా అత్యంత ప్రమాదకరంగా గడ్డపోతారం
-
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
CM YS Jagan: మడకశిరకు వైఎస్ జగన్ మరో వరం
సాక్షి, మడకశిర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మడకశిరకు మరో వరం ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపే బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214.85 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఐదు నెలల్లోపే మడకశిరకు రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1,600 ఎకరాల భూ సేకరణ.. మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,600 ఎకరాల భూమిని సేకరించింది. ఆర్.అనంతపురం, ఛత్రం, గౌడనహళ్లి గ్రామ పంచాయతీల పరిధిలోని రైతుల నుంచి సేకరించిన ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించారు. ఇందుకు సంబంధించి 800 మంది రైతులకు పరిహారాన్ని సైతం ప్రభుత్వం అందజేసింది. వైఎస్సార్ హయాంలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయింది. చదవండి: (తప్పు చేశా.. అందుకు తలవంచుకుంటున్నా!) నీరుగార్చిన టీడీపీ ప్రభుత్వం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే భూ సేకరణ జరగగా... తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పారిశ్రామిక వాడ ఏర్పాటుపై శీతకన్ను వేశాయి. గత టీడీపీ ప్రభుత్వం మరో అడుకు ముందుకేసి అదిగో.. ఇదిగో అంటూ కాలం నెట్టుకొచ్చింది. వైఎస్సార్ హయాంలో 50 శాతం పరిహారాన్ని రైతులకు అందజేయగా.. మిగిలిన 50 శాతం పరిహారం చెల్లింపు విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి ఉదాసీనత కనబరిచింది. దీంతో పారిశ్రామిక వాడ ఏర్పాటు అంశం నీరుగారిపోయింది. ఈ దశలో దాదాపు రూ.25 కోట్ల మిగులు పరిహారాన్ని రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మార్గం సుగమమం చేసింది. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మడకశిర అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. -
పలక కళకళ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్కాపురం పలకల పరిశ్రమ మళ్లీ జీవం పోసుకుంటోంది. కరోనాతో ఎగుమతి ఆర్డర్లు లేక మూతపడిన ఫ్యాక్టరీలు కరోనా తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రస్తుతం దాదాపు 15 ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయి. సుమారు 3 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మార్కాపురం: కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురం పలకల పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షలతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నాలుగైదు నెలల నుంచి ఆంక్షలు ఎత్తి వేయటంతో యజమానులు ఫ్యాక్టరీలను తెరవటంతో మళ్లీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో 6 వేల మందికి పైగా కార్మికులు పనులు లేక భవన నిర్మాణ కార్మికులుగా, ఇతరత్రా కూలీలుగా మారారు. మరికొందరు వలసలు పోయారు. 2010లో ఈ ప్రాంతంలో సుమారు 100 ఫ్యాక్టరీలు ఉండేవి. టీడీపీ హయాంలో అనుసరించిన పారిశ్రామిక విధానాలు, రాయితీల ప్రోత్సాహం లేకపోవటం, విద్యుత్ చార్జీలు పెంచటం, కూలీల చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు లేకపోవటంతో సంక్షోభం ఏర్పడింది. దీంతో 2015 నాటికి ఫ్యాక్టరీల సంఖ్య 30కి చేరింది. మళ్లీ కరోనా రావటంతో అమెరికా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలకు విమానాలు లేక పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేయటంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దాదాపు 15 ఫ్యాక్టరీలలో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు మాత్రమే షిప్‌లలో కొంత మేర ఎగుమతులు పంపుతున్నారు. దేశీయంగా కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు లారీల ద్వారా డిజైన్ స్లేట్స్ పంపుతున్నారు. సుమారు 3 వేల మంది కూలీలు గని కార్మికులుగా, ఫ్యాక్టరీ వర్కర్లుగా, అనుబంధంగా ఉండే బలపాల పరిశ్రమలో కూడా పని చేస్తున్నారు. పలకల గనులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లోని తుమ్మలచెరువు, రాయవరం, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, గజ్జలకొండ, మల్లంపేట, పెద్దయాచవరం, నాయుడుపల్లె తదితర గ్రామాల్లో సుమారు 15 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, గత 8 ఏళ్లుగా ప్రభుత్వాలు పలకల పరిశ్రమల అభివృద్ధికి సహకరించకపోవటంతో ఒక్కొక్కటిగా మూతపడుతూ ప్రస్తుతం 30కి చేరాయి. జీఎస్టీ అదనపు భారం కావటం, విద్యుత్ చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు తగ్గటంతో పలకల పరిశ్రమ ప్రాభవం తగ్గింది. ఇదే సమయంలో చైనాలో కూడా మార్కాపురం పలకల పరిశ్రమలో లభించే రాయి దొరకటం, వారు తక్కువ రేటుకు ఇస్తుండటంతో అమెరికా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాల వారు చైనా నుంచి తెప్పించుకుంటున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట పలకల వాడకం ఎక్కువగా ఉండేది. కంప్యూటర్లు రావటం, విద్యా వ్యవస్థలో మార్పుల వలన పలకల వాడకం తగ్గిపోయింది. దీంతో మార్కాపురం పలకల వ్యాపారులు పలకల రాయిని డిజైన్ స్లేట్‌గా మార్పు చేశారు. మొజాయిక్, పింక్, ఆటమ్, మల్టీకలర్ తదితర రంగుల్లో మార్కాపురం పలకల రాయి లభిస్తుంది. దీనిని వివిధ సైజుల్లో కట్ చేసి గృహాలకు అందంగా అలంకరించేందుకు చెన్నై, ముంబయ్, కోల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇతర దేశాలైన శ్రీలంక, సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు పంపుతున్నారు. రాయితీలు ఇవ్వాలి మార్కాపురం పలకల పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సహకరించాలి. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లుగా మార్కాపురం పలకలకు మినహాయింపు ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, పలకల ఫ్యాక్టరీ యజమాని రాయల్టీ తగ్గించాలి ప్రభుత్వం పలకల గనులపై ఉన్న రాయల్టీని తగ్గించాలి. చిన్న క్వారీలకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలి. ఎక్స్పోర్టులో కూడా ఆంక్షలు సడలించాలి. పలకల పరిశ్రమ బాగుంటే ఈప్రాంతంలో వలసలు ఉండవు, కూలీలందరికీ పని ఉంటుంది. – వెన్నా పోలిరెడ్డి, డిజైన్ స్లేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..
‘సమర్థవంతమైన నాయకత్వం, నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు.. రాకపోకలకు, ఎగుమతులకు అనుకూలత, మదుపరులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానంతో తిరుపతి నగరం వ్యాపారాభివృద్ధికి దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రాంతాల జాబితాలో నిలిచింది. ►ప్రముఖ పారిశ్రామిక నగరంగా ఎదుగుతోంది.. ►ఇందుకు ఉదాహరణే ఇప్పుడు జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ల తయారీకి జియో సంస్థ తిరుపతి కేంద్రంగా శ్రీకారం చుట్టింది. ►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్–2లోని నియోలింక్స్ ప్లాంట్‌లో ఇప్పటికే ఫోన్ల తయారీ చేపట్టింది. ►రానున్న దీపావళికి, లేదా నవంబర్ నెలాఖరులోగా లాంఛనంగా ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్(ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్–2)లో ఉన్న యునైటెడ్ టెలీలింక్స్ నియోలింక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్ సంస్థ త్వరలోనే భారీ పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టెలికాం, కంప్యూటర్ పరికరాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నట్టు సంస్థ పేర్కొంది. 2023 మార్చి నాటికి భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఫోన్ మొత్తం తయారీ ఇక్కడే.. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆండ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్లో పొందుపరిచారు. 10 భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్వేర్ దానంతట అదే అప్డేట్ అవుతుందని సంస్థ వెల్లడించింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన నియో లింక్స్ ప్లాంట్‌లో మదర్బోర్డ్ ఒక్కటే తయారవుతుండగా, రేణిగుంటలోని ప్లాంట్‌లో మదర్బోర్డ్ సహా ఫోన్ మొత్తం తయారవుతుండడం విశేషం. నెలకు ఐదు లక్షల ఫోన్ల తయారీ జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలోని ప్లాంట్‌లో నెలకు సగటున ఐదులక్షల ఫోన్లను తయారు చేస్తున్నామని నియోలింక్స్ ప్లాంట్ జనరల్ మేనేజర్ సాయి సుబ్రమణ్యం తెలిపారు. ఫోన్ల తయారీలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న ట్లు వెల్లడించారు. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ.. తిరుపతి సమీపంలోని రేణిగుంట, ఏర్పేడుల్లో ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్‌ను భూసేకరణ వివాదంతో గత టీడీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. 2018లో భూసేకరణ సందర్భంగా జరిగిన అవకతవకలు, అక్రమాల కారణంగా ఇక్కడ రిలయన్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఒకింత జాప్యం చేసింది. కానీ టీడీపీ వర్గాలు, పచ్చమూకలు ఆ నెపాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపాలని చూశాయి. వైఎస్సార్సీపీ సర్కారు రాకతోనే ఆ సంస్థ వెనక్కి మళ్లిందని ఇష్టానుసారం విషం చిమ్మాయి. ఇప్పుడు ఆ భూసేకరణ వ్యవహారాన్ని కాస్త పక్కనపెడితే.. టీడీపీ విషప్రచారం మాత్రం వందశాతం ఒట్టిదేనని నిర్ధారణైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ప్రతిష్టాత్మక జియో ఫోన్ నెక్ట్స్ తయారీకి తిరుపతినే ఎంచుకుని అన్ని దుష్ప్రచారాలను పటాపంచలు చేసింది -
బతుకు గ్యారేజ్..!
కష్టజీవులకు ఉపాధి కల్పించే బస్తీ.. ఇండస్ట్రియల్ ఎస్టేట్. చిత్తూరు నగరానికి చివర్లో ఉన్న ఈ ఎస్టేట్.. కార్మికుల జీవనోపాధికి కేంద్రంగా ఉంది. శ్రమనే నమ్ముకున్న ప్రతి శ్రామికుడికి ఈ ఎస్టేట్‌లో ఉపాధి దొరుకుతోంది. ఆటో నుంచి లారీ, జేసీబీల వరకు నూతన బాడీ కట్టించుకోవడం, రిపేర్లు చేయించుకోవాలంటే.. వాహన యజమానులందరూ ఈ ఎస్టేట్‌నే ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. సాక్షి, చిత్తూరు రూరల్ : చిత్తూరు నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఇక్కడ వివిధ రకాలైన మెకానికల్ షాపులు 170 దాకా ఉన్నాయి. ఈ షాపుల్లో 3వేలకు పైగా శ్రామికులు పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆటోలు, కార్లు, టిప్పర్లు, లారీలు, బస్సుల రిపేర్ పనులు అధికంగా ఉంటాయి. అలాగే లేత్, గ్లాస్ వర్క్, లైనర్, వెల్డర్, డ్రిల్లర్, పెయింటర్, బాడీ బిల్డర్ (బస్సులు, లారీలకు బాడీ కట్టేవారు), బ్యాటరీ తయారీ.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు పనులు ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. వాహనాలు రిపేర్ వస్తే.. చిత్తూరు వాసులే కాకుండా మదనపల్లి, పలమనేరు, పీలేరు, పుత్తూరు, తిరుపతి, తమిళనాడులోని పళ్లిపట్టు, పొన్నై వాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మంచి నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు ఎస్టేట్‌లో ఉండడంతో ఈ సంఖ్య ఇటీవల మరింత పెరిగింది. స్వయం కృషితో... మెకానిక్‌లుగా ఎస్టేట్‌లో చాలా మంది బతుకు బండి లాగుతున్నారు. వీరిలో చాలా మంది మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకుని పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది శ్రామికులు ఇక్కడ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ పనీ లేకున్నా ఎస్టేట్‌ను ఆశ్రయించిన వారికి ఏదో రకంగా ఉపాధి దొరుకుతోంది. పని నేర్చుకోవాలి.. సంపాదించాలనే తపన ఉన్న వ్యక్తులకు ఈ ఎస్టేట్ కొండంత అండగా నిలుస్తోంది. ఇక్కడ హెల్పర్, దినసరి కూలీగా పనిలో చేరి.. సొంత షాపు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారంతా తాము స్వయం కృషితోనే పైకి వచ్చామని, ఈ ఎస్టేట్ తమకు ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అంటున్నారు. చిత్తూరుకు పరిశ్రమలు వస్తే తమలాంటి వాళ్లకు మరింత మేలు చేకూరుందని పలువురు భావిస్తున్నారు. పరిశ్రమలు రావాలి.. చిత్తూరుకు పరిశ్రమలు రావాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు పనులు పుష్కలంగా ఉంటాయి. నేను లారీ, బస్సు ఇంజిన్ రిపేర్ చేస్తాను. సొంతంగా షాపు ఉంది. రోజూ కూలి గిట్టుబాటు అవుతోంది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – పటేల్, చిత్తూరు 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎస్టేట్‌లో మెకానిక్‌గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. నెలకు నాకు రూ.10 వేలు వస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. చేతినిండా పని ఉంది. చిన్నతనంలోనే లారీ, బస్సు రిపేర్లు నేర్చుకున్నాను. ఎక్కడికెళ్లినా పని చేయగలను. – పురుషోత్తం, చిత్తూరు శ్రమకు తగ్గ వేతనం.. నేను చిన్నతనంలోనే ఇక్కడ పనికి వచ్చా. మూడేళ్లలో పని నేర్చుకున్నా. మెకానిక్ పనులతో పాటు బ్యాటరీ తయారీ, రిపేర్లు చేస్తా. కూలి గిట్టుబాటు అవుతోంది. నేను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. – మోహన్, చిత్తూరు -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలో శనివారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని ఓ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 15 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందా? అనే దానిపై స్పష్టత లేదు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ముంబైలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. గత నెలలో ముంబైలోని కమలా మిల్స్ బిల్డింగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రూఫ్‌టాప్‌లో ఉన్న పబ్‌లో మంటలు చేలరేగి 14 మంది మృతి చెందారు. -
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం
= హెచ్చు మీరిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి = అదే దారిలో అధికారులు కూడా.. = ఎంఎస్‌ఈడీసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ధ్వజం ఒంగోలు క్రైం : రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యమైపోయిందని, కోలుకోలేని స్థితికి చేరుకుందని మైక్రో స్మాల్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఈడీసీ) రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామారావు ధ్వజమెత్తారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంఎస్‌ఈడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మీరాజ్యంతో కలిసి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన చంద్రబాబు దాన్ని పక్కన బెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆరాట పడటం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే ప్రత్యేక ప్యాకేజీ అయితే ఒక్క చంద్రబాబుకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రంలో మూడేళ్లలో కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐఐ పార్టనర్ షిప్లో ఏడాది రూ.4 లక్షల 83 వేల కోట్లు, రెండో సంవత్సరం రూ.11 లక్షల 22 వేల కోట్లు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఐదారు దేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు ఘనంగా వస్తాయని ఊకదంపుడు ఉపన్యాసాలు గుప్పించారని, అవన్నీ ఏ మయ్యాయని దుయ్యబట్టారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్నారని, ఎల్టీ పారిశ్రామిక వేత్తలకు పవర్ టారిఫ్ యూనిట్‌కు రూ.7లు చొప్పున, ఫిక్స్డ్ చార్జీల కింద 41.13 పైసలు, హెచ్డీ కేవీఏకు 385.13 పైసలు వసూలు చేస్తున్నారని వివరించారు. విద్యుత్ టారిఫ్ పెంచినా, ఫిక్స్డ్ చార్జీలు పెంచినా, డిమాండ్ చార్జీలు పెంచినా పారిశ్రామిక రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 39 రీసైకిల్ పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయని, వాటికి రా మెటీరియల్ దొరకక అల్లాడుతుని చెప్పారు. దీనికి తోడు చైనా నుంచి వైట్ పేపర్ తక్కువ ధరకు దిగుమతి అవుతోందన్నారు. పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించేందుకు ఒక్క మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లేకపోవటం కూడా పారిశ్రామిక రంగం వెనుకబాటుకు ప్రధాన కారణమని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న సీఎం: అధికారంలోకి రావడం కోసం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంటని, అన్ని వర్గాల వారికి రుణమాఫీ..అని లేనిపోని ఆశలు చూపి కులాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి రాగానే సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుక్కొని తిరిగి అధికారంలోకి రావచ్చని భావిస్తున్నాని విమర్శించారు. రుణమాఫీ తప్పుడు నిర్ణయమని, దానివల్ల ధనవంతులే లాభపడ్డారన్నారు. ప్రభుత్వ, ఉడా ఆస్తులను బంధువులు, స్నేహితులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు అవినీతితో అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి పెరిగిపోయిందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీకి కట్టబెట్టి సీఎం రూ.లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. పారిశ్రామిక రంగంపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని పారిశ్రామిక కేంద్రాలను సూక్ష్మ చిన్న పరిశ్రమల వ్యాపార అభివృద్ధి సంస్థకు కేటాయించాలని రామారావు డిమాండ్ చేశారు. -
ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడ
టీఎస్ఐఐసీ యాప్ ప్రారంభించిన చైర్మన్ బాలమల్లు సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేర్కొన్నారు. గురువారం టీఎస్ఐఐసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సహజవనరుల లభ్యతను బట్టి పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, ఫుడ్‌పార్క్, టెక్స్టైల్ పార్క్, లెదర్ పార్క్, ప్లాస్టిక్ పార్క్, ఇబ్రహీంపట్నం ఫైబర్‌గ్లాస్ పార్క్‌ల్లో ప్లాట్ల కేటారుుంపునకు సంబంధించి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై అధికారులు వివరించారు. -
రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఐదుగురికి తీవ్రగాయాలు వంట చేసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బుకాయింపు అంబులెన్స్‌లో కాకుండా ఆటోలో హుటాహుటిన తరలింపు కడప అర్బన్ : కడప నగర శివార్లలో పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం మణి రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు కానీ, అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిప్తోంది. – బాధితుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగర శివార్లలోని మణి రబ్బరు ఫ్యాక్టరీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రామచంద్ర్(35), మానస్ (20), సరోజ్ (22), వికాస్ (25), కమలాపురానికి చెందిన సత్యనారాయణలు కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరంతా రోజూ మాదిరిగానే సోమవారం కూడా రబ్బరు తయారీలో భాగంగా ఫ్యాక్టరీలో వున్న బ్రాయిలర్లోకి పొట్టును గంపలతో వేయసాగారు. ఈక్రమంలో అందులో నుంచి ఒక్కసారిగా మంటలు వీరిపైకి దూసుకొచ్చాయి. దీంతో తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడి నుంచి వారిని ఫ్యాక్టరీలోని కార్మికుల మేస్ట్రీ వెంట రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక శాఖ వారు తమ వాహనంతో వస్తే, వారిని కూడా వెనక్కి పంపించేశారు. అనంతరం రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది తమ వంతుగా వైద్య సేవలను అందించారు. అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యం వీరిని బలవంతంగా ఆసుపత్రి నుంచి ఆటోల్లో తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ వద్దకు మీడియా బందం విషయం కనుగొనేందుకు వెళ్లగా.. అక్కడ వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తూ, బాధితులు వంట చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని బుకాయించే ప్రయత్నం చేశాడు. గాయపడ్డవారిలో సరోజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. -
కడపలో భారీ అగ్ని ప్రమాదం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వెంకటేశ్వర బయో క్రూడ్స్ సంస్థలో శుక్రవారం ఉదయం ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఏర్పడ్డ మంటల వల్ల ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 8 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటనపై సంస్థ యజమాని శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో పరిశ్రమలకు ఉపయోగపడే ఇండస్ట్రియల్ ప్యూయల్స్‌ను టైర్ల ద్వారా తయారు చేస్తామన్నారు. సంఘటన జరిగిన గంట తర్వాత గుర్తించామన్నారు. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించామన్నారు. వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రెందు గంటలపాటు శ్రమించగా ఇంకా ప్రభావం అలాగే వుందన్నారు. మూడేళ్ల క్రితం తమ ఫ్యాక్టరీలోనే యంత్రాలలో మంటలు ఏర్పడి ప్రమాదం జరిగిందన్నారు. తర్వాత శనివారం నుంచి మరలా పరిశ్రమను నడిపేందుకు మెటీరియల్ తెప్పించుకున్నామన్నారు. తమ సంస్థ ఆవరణంలోనే వున్న ట్రాన్స్ఫార్మర్ నుంచి అపుడపుడు మంటలు వస్తున్నాయనీ విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వచ్చేవారు ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ కాకుండా చూస్తారనీ తెలిపారన్నారు. అంతలోపు ప్రమాదం జరిగిందన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు : ఈ ప్రమాదంపై సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అప్పటికే చెలరేగుతున్న మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం స్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి విజయకుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఈయనతోపాటు కడప అగ్నిమాపక అధికారి నాగరాజు నాయక్, ఎల్ఎఫ్ఎం వెంకట సుబ్బయ్యతో పాటు నరసింహులు, రామచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.సంఘటన స్థలాన్ని కడప ఆర్డీఓ చిన్నరాముడు తమ సిబ్బందితో పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని బాధితుడు అధికారులకు తెలియజేశారు. – ఫోటో రైటప్ 26 కెడిపి 704, 705– సంఘటనా స్థలంలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 26 కెడిపి 706– అధికారులకు సంఘటన గురించి వివరిస్తున్న బాధితుడు శ్యాం సుందర్ రెడ్డి -
‘తాండూర్‌లో పారిశ్రామిక వాడ'
తాండూర్: రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో నాపరాత్రి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాండూర్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాలిషింగ్ యూనిట్లన్నిటినీ ఒకే చోటికి తరలించనున్నట్లు వివరించారు. జినుగుర్తి వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటుపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. -
ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అగ్నిప్రమాదం
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని చైతన్య ప్లాస్టిక్ రీసైక్లిక్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు చెలరేగినట్లు యజమాని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల ఆస్టి నష్టం జరిగినట్లు చెప్పారు. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో బిల్డింగ్ కుప్పకూలింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
పారిశ్రామికవాడ ఏర్పాటులో జాప్యం!
- స్పందించని ప్రజాప్రతినిధులు - చొరవచూపాలని ప్రజల వినతి తాండూరు: నాపరాతి వ్యర్థాలతో తలెత్తుతున్న కాలుష్యం నుంచి తాండూరు ప్రజలకు విముక్తి కలగటం లేదు. పారిశ్రామికవాడ(ఇండస్ట్రీయల్ ఎస్టేట్) ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సుమారు ఐదేళ్లుగా ఊరిస్తున్న పారిశ్రామికవాడ ఏర్పాటుపై అధికారులు ఊదాసీనతను ప్రదర్శిస్తున్నారు. మైక్రో స్మాల్అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఎంఈ) కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నా స్థల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో ఏళ్లుగా పారిశ్రామిక వాడ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. తాండూరు మండలం జినుగుర్తిలో సర్వే నంబర్ 206లో 300 ఎకరాల అసైన్డ్‌భూమిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించాలని గతంలో రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇంత వరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపుపై తాజాగా ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ తాండూరు రెవెన్యూ అధికారులకు వారం రోజుల క్రితం లేఖ రాసింది. రెండు,మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపించనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా తాండూరు పట్టణం చుట్టూ దాదాపు 500 వరకు నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నాపరాతి ముక్కలు, ఇతర డస్టును పట్టణంలో రోడ్ల పక్కన డంపింగ్ చేస్తున్నారు. తద్వారా కాలుష్య సమస్యతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పాశ్రామిక వాడ ఏర్పాటు చేసి, పట్టణం చుట్టూ ఉన్న పాలిషింగ్ యూనిట్లను అక్కడికి తరలించాలనే డిమాండ్ ఉంది. ఇందుకు నాపరాతి పరిశ్రమ వర్గాలు కూడా అంగీకరించా యి. స్థలం కేటాయింపులో జరుగుతున్న జాప్యంతో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
శుభకార్యానికి వెళ్తూ...అనంత లోకాలకు
మార్కాపురం: మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి మార్కాపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన గంపల పెద్దపోలయ్య మూడేళ్ల నుంచి పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడులో నివాసం ఉంటున్నాడు. మార్కాపురం పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి మార్కాపురం వచ్చి ఆటోలో బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా డ్రైవర్స్ కాలనీ దగ్గరకు రాగానే ఎదురుగా మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంపల పోలయ్య కుమారుడు దినేష్ (9), మరదలు ఎస్తేరు రాణి అలియాస్ ప్రశాంతి (13), ఆటో డ్రైవర్ స్థానిక కొండారెడ్డికాలనీకి చెందిన కిశోర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. పోలయ్య తో పాటు, అతని భార్య విజయమ్మ, కుమార్తె జెస్సీ, కుమారుడు జశ్వంత్‌లు గాయాలపాలయ్యారు. విజయమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. మిగిలిన వారికి స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు. సంఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ బలరాంరెడ్డి ట్రాక్టర్‌తో సహా ఉడాయిస్తుండగా పట్టణ శివారుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఉయ్యాల రాంబాబులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువుల రోదనతో, రక్తపుమడుగుతో సంఘటన స్థలం భీతావహంగా ఉంది. -
తరలింపు ఇంకెప్పుడు!
తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న నాపరాతి వ్యర్థాల కాలుష్యంతో తాండూరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం చుట్టూ సుమారు 200లకుపైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడే వ్యర్ధాలతో ఉత్పన్నమవుతోన్న కాలుష్యం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ యూనిట్లను పట్టణానికి దూరంగా తరలించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. పట్టణ సమీపంలో ఇందుకోసం పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ ఎస్టేట్)ను నిర్మించాలని మిగతా 2వ పేజీలో ఠసాక్షి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గత సంవత్సరం జూలై 21వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ పేదలకు గృహ వసతి కల్పించే ఈ పథకం ద్వారా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అందుకుగాను తొలుత పైలట్ ప్రాజెక్టుగా శేరిలింగంపల్లిలోని కేశవనగర్ను ఎంపికచేసి .. పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కేశవనగర్‌లోని 334 కుటుంబాలకు వారుంటున్న ప్రాంతంలోనే ఇళ్లను కట్టాల్సి ఉంది. అందుకుగాను గృహనిర్మాణం పూర్తయ్యేంతదాకా వారు ఉండేందుకు తొలిదశలో 320 ట్రాన్సిట్ హౌసింగ్ యూనిట్లు(ఇళ్లు) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. రూ. 6.66 కోట్లతో టెండరు దక్కించుకున్న సాయితేజ కన్స్ట్రక్షన్స్కు జీహెచ్ఎంసీలోని గృహనిర్మాణ విభాగం అధికారులు సదరు స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. అందుకుగాను అక్కడకు వెళ్లిన గృహనిర్మాణ అధికారులకు ఆ స్థలంలో కొంతభాగం కబ్జా కావడం కనిపించింది. తీరా ఆరా తీస్తే జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులే అక్కడ శ్మశానవాటిక నిర్మాణం కోసం రెండు ప్రహరీలు నిర్మించారని తెలిసింది. దాంతో అక్కడ ట్రాన్సిట్ ఇళ్లు నిర్మించేందుకు ఆటంకం ఏర్పడింది. అంతేకాదు.. కేశవనగర్‌లో ఇళ్లు నిర్మించే కాలనీకి అప్రోచ్ దారి మూసుకుపోయింది. దాన్ని చూసి తెల్లబోయిన గృహనిర్మాణ శాఖ అధికారులు ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారు. కబ్జా కేసు పెడదామా అంటే పరాయివారు కాదు. తమ జీహెచ్ఎంసీ సోదరులే. రికార్డులున్నా.. సదరు స్థలంలో ట్రాన్సిట్ ఇళ్ల నిర్మాణం కోసం శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దారు సర్వేనెంబరు 37లో జీహెచ్ఎంసీకి ఎకరా 34 గుంటల స్థలాన్ని అప్పగించారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజనీర్లు నిర్మించిన ప్రహరీలు తొలగించి.. ఇళ్ల నిర్మాణాలకు వీలుగా సదరు స్థలాన్ని తమకు అప్పగించాల్సిందిగా గృహనిర్మాణ శాఖ అధికారులు స్థానిక శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌తోపాటు వెస్ట్‌జోన్ కమిషనర్‌కు సైతం లేఖలు రాశారు. ఇది జరిగి నెల రోజులవుతున్నా ఇంతవరకు ప్రహరీలు తొలగించలేదు. దాంతో ఏం చేయాలో తోచక వారు అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన.. దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్టుకు ఇలా బ్రేక్ పడింది. -
ఆరేళ్లుగా ‘పాలిష్’
=బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా పలమనేరు =తడ నుంచి రవాణా అవుతున్న తమిళ బియ్యం =స్థానికంగా ఓ ముఠా కార్యకలాపాలు =బంగారుపేట నుంచి ఇక్కడికి పాలిష్ బియ్యం =గుడియాత్తం నుంచి బస్సుల్లో రోజూ రవాణా కల్తీ బియ్యం అక్రమ రవాణాలో అక్రమార్కుల అడ్డదారులు అధికారులనే నివ్వెరపరిచారుు. తీగలాగితే డొంకంతా కదిలిన వైనంగా నెల్లూరు జిల్లా తడ నుంచి కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు తమిళనాడు చౌకబియ్యం తరలుతున్న గుట్టు రట్టు అయియంది. పలమనేరులో ఒక ముఠా ఆరు సంవత్సరాలుగా తమిళనాడు బియ్యూన్ని బంగారుపేటకు తరలించి పాలిష్ చేసి, మధ్యరకం బియ్యం కలిపి కిలో రూ.35కు అమ్ముతూ జేబులు నింపుకుంటోంది. ఈ అక్రమ రవాణాకు కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న పలమనేరును ఈ ముఠా అడ్డాగా మార్చుకుంది. శనివారం జరిగిన అధికారుల దాడుల్లో తమిళబియ్యం దొరికింది కొంతే అయినా అక్రమాల గురించి మాత్రం మంచి సమాచారమే దొరికింది. మొత్తం మీద ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తమిళ బియ్యానికి పాలిష్’ కథనంతో చేపట్టిన దాడులతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరు కేంద్రంగా సాగుతున్న తమిళ బియ్యం అక్రమరవాణాపై పౌరసరఫరాలశాఖ అధికారులు శనివారం చేసిన దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అక్రమాలపై అధికారులకే ఆశ్చర్యం కలిగించే విషయూలు వెలుగులోకి వచ్చారుు. ఇక్కడికి నెల్లూరు జిల్లా తడ నుంచి భారీగా తమిళబియ్యం అక్రమంగా తరలివస్తున్నట్లు గుర్తించారు. వీటిల్లో చాలా లోడ్లు కర్ణాటకలోని బంగారుపేటకు వెళుతున్నారుు. కొంతమేరకు మాత్రమే పలమనేరు, వి.కోటకు వస్తున్నట్లు తెలిసింది. ఇక్కడికి అక్రమంగా తరలే తమిళబియ్యం, కల్తీ చేసి విక్రయించే ప్యాకింగ్‌లు ఆరేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాడులు నామమాత్రమే పలమనేరు ప్రాంతంలో ఎక్కడెక్కడ బియ్యం స్టాక్ పాయింట్లున్నాయి. ఈ అక్రమాల వెనుక ఉన్న ముఠా ఏది తదితర విషయాలపై పక్కా సమాచారం లేకుండా దాడులు చేపట్టడంతో నామమాత్రంగా మారాయి. ఒక చోట భారీగా వివిధ బ్రాండ్ల పేరుతో ముద్రించిన ఖాళీ సంచులు, కల్తీ చేశాక ప్యాకింగ్ చేసే యంత్రాలను చూశాక అధికారులు నివ్వెర పోయూరు. ఈ వ్యాపారం భారీగానే సాగుతున్నట్లు గుర్తిం చారు. అధికారులు దాడులు చేపట్టేందుకు కొ న్ని గంటల ముందే స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి రెండు లారీల తమిళబియ్యూన్ని తరలిం చినట్లు అధికారులకు పక్కాసమాచారం అం దింది. విజిలెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారు లు దాడులు చేసి ఉన్నట్లయితే భారీగా అక్రమా లు బయటపడి ఉండేవని స్థానికులు అంటున్నారు. తడ టూ బంగారుపేట్..... చెన్నైకి స్టీమర్లద్వారా చేరే తమిళ బియ్యాన్ని కొం దరు చిన్నబోట్లలో నింపుకొని సముద్రం గుం డా నెల్లూరు జిల్లాలోని తడకు చేరవేస్తున్నట్లు సమాచారం. అక్కడినుంచి యథేచ్ఛగా పది చ క్రాల లారీల్లో చిత్తూరు- పలమనేరు, వి.కోటల మీదుగా కర్ణాటకలోని బంగారుపేట్‌కు ఈ అక్ర మ రవాణా సాగుతోంది. ఈ క్రమంలో పలమనేరులోని కొన్ని స్టాక్ పాయింట్లకు సైతం ఇదే లారీల గుండా సరుకు అందుతోంది. ఈ బి య్యాన్ని సైజులవారీగా పాలిష్చేసే భారీ యం త్రాలు బంగారుపేట ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి పాలిష్ అరుున బియ్యం స్థానిక ముఠాకు చేరుతోంది. వీరు ఇక్కడ రకరకాల మధ్యరకం బియ్యూన్ని కలిపి ప్యాకింగ్ చేసి విక్రరుుస్తున్నారు. ఒక ముఠా ఈ మొత్తం తతంగా న్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి పోలీసు ఉన్నతాధికారుల అండదండలున్నట్లు వినికిడి. గుడియాత్తం నుంచి రోజూ బస్సుల్లోనే తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం నుంచి పలమనేరు పట్టణానికి రోజూ ప్రైవేటు బస్సుల్లోనే భారీగా తమిళ బియ్యం రవాణా అవుతోంది. పలమనేరుకు సమీపంలో గుడియూత్తం ఉండడంతో బస్సు సీట్ల కింద, టాప్ పైన , 30 కిలోల ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. బస్సు రాగానే కొందరు కూలీలు ఈ బియ్యాన్ని రిక్షాల్లో వేసుకుని స్టాక్ పాయింట్లకు తీసుకెళ్తున్నారు.