తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న నాపరాతి వ్యర్థాల కాలుష్యంతో తాండూరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం చుట్టూ సుమారు 200లకుపైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడే వ్యర్ధాలతో ఉత్పన్నమవుతోన్న కాలుష్యం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ యూనిట్లను పట్టణానికి దూరంగా తరలించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. పట్టణ సమీపంలో ఇందుకోసం పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ ఎస్టేట్)ను నిర్మించాలని
మిగతా 2వ పేజీలో ఠసాక్షి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గత సంవత్సరం జూలై 21వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
పట్టణ పేదలకు గృహ వసతి కల్పించే ఈ పథకం ద్వారా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అందుకుగాను తొలుత పైలట్ ప్రాజెక్టుగా శేరిలింగంపల్లిలోని కేశవనగర్‌ను ఎంపికచేసి .. పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కేశవనగర్‌లోని 334 కుటుంబాలకు వారుంటున్న ప్రాంతంలోనే ఇళ్లను కట్టాల్సి ఉంది. అందుకుగాను గృహనిర్మాణం పూర్తయ్యేంతదాకా వారు ఉండేందుకు తొలిదశలో 320 ట్రాన్సిట్ హౌసింగ్ యూనిట్లు(ఇళ్లు) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. రూ. 6.66 కోట్లతో టెండరు దక్కించుకున్న సాయితేజ కన్‌స్ట్రక్షన్స్‌కు జీహెచ్‌ఎంసీలోని గృహనిర్మాణ విభాగం అధికారులు సదరు స్థలాన్ని అప్పగించాల్సి ఉంది.
అందుకుగాను అక్కడకు వెళ్లిన గృహనిర్మాణ అధికారులకు ఆ స్థలంలో కొంతభాగం కబ్జా కావడం కనిపించింది. తీరా ఆరా తీస్తే జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులే అక్కడ శ్మశానవాటిక నిర్మాణం కోసం రెండు ప్రహరీలు నిర్మించారని తెలిసింది. దాంతో అక్కడ ట్రాన్సిట్ ఇళ్లు నిర్మించేందుకు ఆటంకం ఏర్పడింది. అంతేకాదు.. కేశవనగర్‌లో ఇళ్లు నిర్మించే కాలనీకి అప్రోచ్ దారి మూసుకుపోయింది. దాన్ని చూసి తెల్లబోయిన గృహనిర్మాణ శాఖ అధికారులు ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారు. కబ్జా కేసు పెడదామా అంటే పరాయివారు కాదు. తమ జీహెచ్‌ఎంసీ సోదరులే.
రికార్డులున్నా..
సదరు స్థలంలో ట్రాన్సిట్ ఇళ్ల నిర్మాణం కోసం శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దారు సర్వేనెంబరు 37లో జీహెచ్‌ఎంసీకి ఎకరా 34 గుంటల స్థలాన్ని అప్పగించారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజనీర్లు నిర్మించిన ప్రహరీలు తొలగించి.. ఇళ్ల నిర్మాణాలకు వీలుగా సదరు స్థలాన్ని తమకు అప్పగించాల్సిందిగా గృహనిర్మాణ శాఖ అధికారులు స్థానిక శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌తోపాటు వెస్ట్‌జోన్ కమిషనర్‌కు సైతం లేఖలు రాశారు. ఇది జరిగి నెల రోజులవుతున్నా ఇంతవరకు ప్రహరీలు తొలగించలేదు. దాంతో ఏం చేయాలో తోచక వారు అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన.. దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్టుకు ఇలా బ్రేక్ పడింది.
తరలింపు ఇంకెప్పుడు!
Published Sat, Nov 30 2013 4:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement