
ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అగ్నిప్రమాదం
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని చైతన్య ప్లాస్టిక్ రీసైక్లిక్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు చెలరేగినట్లు యజమాని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల ఆస్టి నష్టం జరిగినట్లు చెప్పారు. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో బిల్డింగ్ కుప్పకూలింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.