ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Fire Breaks Out in a Goregaon East Factory at Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Jan 27 2018 1:03 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

 Fire Breaks Out in a Goregaon East Factory at Mumbai

ముంబై: ముంబైలో శనివారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని ఓ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 15 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందా? అనే దానిపై స్పష్టత లేదు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ముంబైలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. గత నెలలో ముంబైలోని కమలా మిల్స్‌ బిల్డింగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రూఫ్‌టాప్‌లో ఉన్న పబ్‌లో మంటలు చేలరేగి 14 మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement